బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ దిశగా మరో ముందడుగు! - BPCL sells its stake in NRL to OIL
close

Updated : 27/03/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ దిశగా మరో ముందడుగు!

దిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందడుగు వేసింది. అసోంలోని నుమాలీగఢ్‌ రిఫైనరీ (ఎన్‌ఆర్‌ఎల్‌) నుంచి బీపీసీఎల్‌ పూర్తిగా వైదొలిగినట్లు ప్రకటించింది. ఎన్‌ఆర్‌ఎల్‌లో తనకున్న 61.65 శాతం వాటాను అస్సాం ప్రభుత్వం, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌(ఓఐఎల్‌), ఇంజినీర్స్‌ ఇండియా కన్సార్షియానికి విక్రయించినట్లు పేర్కొంది. ఈ ఒప్పంద విలువ సుమారు రూ. 9,876 కోట్లుగా వెల్లడించింది. 

మొత్తం 61.5 శాతం బీపీసీఎల్‌ వాటాల్లో ఆయిల్‌ ఇండియా 54.16 శాతం, దాని భాగస్వామి ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌(ఈఐఎల్‌) 4.4 శాతం, మిగిన వాటాల్ని అసోం ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో ఎన్‌ఆర్‌ఎల్‌లో ఆయిల్‌ ఇండియా వాటా 80.16 శాతానికి చేరింది. ‘అస్సాం శాంతి ఒడంబడిక’ ప్రకారం ఎన్‌ఆర్‌ఎల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న బీపీసీఎల్‌.. ఎన్‌ఆర్‌ఎల్‌ను పక్కకు తప్పించడం ద్వారా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించనుంది.

బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించడంలో భాగంగా కంపెనీలో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేదాంత గ్రూప్‌తో పాటు అపోలో గ్లోబల్, థింక్‌ గ్యాస్‌ తదితర సంస్థలు వీటిని కోనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని