మార్కెట్లోకి సరికొత్త డీమాక్స్‌ - BS6 Compliant Isuzu D Max V Cross Range Launched In India
close

Published : 10/05/2021 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లోకి సరికొత్త డీమాక్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇసుజు మోటార్స్‌ ఇండియా భారత్‌లోకి సరికొత్త డీమ్యాక్స్‌ వీక్రాస్‌ వాహనాన్ని తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.16.98 లక్షలు(తమిళనాడు ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. ఈ పికప్‌ ట్రక్‌ మొత్తం హైల్యాండర్‌, వీక్రాస్‌ జడ్‌ 2డబ్ల్యూడీ ఏటీ, జెడ్‌ ప్రస్టేజ్‌ 4డబ్ల్యూ ఏటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. వీటిల్లో హైల్యాండర్‌  వేరియంట్‌కు రియర్‌ వీల్‌ డ్రైవ్‌ ఆప్షన్‌ను ఇచ్చింది. హైల్యాండర్‌  రూ.16.98 లక్షలు, జెడ్‌ 2 డబ్ల్యూడీ ఏటీ రూ.19.98 లక్షలు, జెడ్‌ 4 డబ్ల్యూడీ ఎంటీ, జడ్‌ ప్రెస్టేజ్‌  4 డబ్ల్యూడీ ఏటీ రూ.24.49 లక్షలు గా నిర్ణయించారు. 

డీమ్యాక్స్‌లో 1.9లీటర్‌ ఇంజిన్‌ 161 బీహెచ్‌పీ శక్తిని, 360 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ సరికొత్త ఇంజిన్‌లో గతంతో పోలిస్తే 12 హెచ్‌పీ, 10ఎన్‌ఎం టార్క్‌ అదనంగా లభిస్తోంది.  6 స్పీడ్‌ మాన్యూవల్‌, 6స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి. గతంలో బీఎస్‌4 ఇంజిన్‌లో 2.5 లీటర్‌ ఇంజిన్‌ ఉంది. ఈ కారు ఎంట్రి లెవల్‌ మోడల్‌లో హోలోజెన్‌ హెడ్‌ల్యాంప్‌, బ్లాక్‌ ఓఆర్‌వీఎం, స్టీల్‌ వీల్స్‌ను అమర్చారు. దీనిలో మాన్యూవల్‌ హెచ్‌వీఏసీ యూనిట్‌ కూడా ఉంది. డ్యూయల్‌ ఎయిర్‌ బ్యాగ్‌, ఏబీఎస్‌, ఈబీడీ , రివర్స్ పార్కింగ్‌  వంటి ఫీచర్లను  స్టాండర్డ్‌గా ఇచ్చారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని