మరోసారి పెరిగిన బుల్లెట్‌ 350 ధర! - BS6 Royal Enfield Bullet 350 gets costlier for the second time
close

Published : 27/02/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి పెరిగిన బుల్లెట్‌ 350 ధర!

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (ఆర్‌ఈ) తన బుల్లెట్‌ 350 బీఎస్‌6 మోడల్స్‌ ధరను మరోసారి పెంచింది. 2021లో ఇలా ధరల్ని సవరించడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ఈ ఏడాది బైక్ ధర దాదాపు రూ.9 వేలు పెరిగింది. దీంతో గత ఏడాది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 విడుదలైనప్పుడు రూ.1.21లక్షలుగా ఉన్న ధర ఇప్పుడు రూ.1.30 లక్షలకు చేరింది. తాజాగా వేరియంట్‌ను బట్టి రూ.3,100 నుంచి రూ.3,500 వరకు పెంచారు. భారత విపణిలో బుల్లెట్‌ 350 మూడు వేరియంట్లలో లభిస్తున్న విషయం తెలిసిందే. పెంచిన తర్వాత ధరల వివరాలు ఇలా ఉన్నాయి...

* బుల్లెట్‌ 350 స్టాండర్డ్‌ : రూ.1,30,228

* బుల్లెట్ 350 (బ్లాక్ అండ్ ఫారెస్ట్‌ గ్రీన్‌‌): రూ.1,36,502

* బుల్లెట్‌ 350 ఈఎస్‌ (ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌): రూ. 1,46,152


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని