close

తాజా వార్తలు

Published : 21/10/2020 21:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి స్పెషల్‌ ఆఫర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) తన కస్టమర్ల కోసం స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త రూ. 135 ఓచర్‌ను తీసుకున్న వారు 1440 నిమిషాల పాటు ఏ నెట్‌వర్క్‌ వినియోగదారులతోనైనా మాట్లాడుకునే అవకాశం కల్పించింది. గతంలో ఈ ప్లాన్‌ 300 నిమిషాలకే పరిమితమై ఉండేది. కొత్త టారిఫ్‌ ఓచర్‌ 24 రోజలు వ్యాలిడిటీతో పనిచేస్తుంది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటనను విడుదల చేసింది. దీంతో పాటు అక్టోబరు 22 లోగా రూ. 160 రీఛార్జ్‌ చేసుకున్న వారికి అంతే మొత్తాన్ని మూడు రోజులు పాటు వినియోగించుకునే ఆఫర్‌ను ఈ టెలికాం సంస్థ కస్టమర్లకు అందిస్తోంది. 



 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.