close

Published : 15/02/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దీపావళికి ఫోక్స్‌ వ్యాగన్‌ టైగన్‌

ముంబయి: వాహన గిరాకీ గత కొన్ని నెలలుగా పుంజుకుంటుండంతో ఫోక్స్‌ వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ ఇండియా, దేశీయంగా మళ్లీ ప్రాభవం సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది దీపావళికి ముందుగా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ టైగన్‌ను విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ‘ఇండియా 2.0 ప్రణాళికలో భాగంగా గత ఏడాది కంపెనీ 100 కోట్ల యూరోల (సుమారు రూ.8,800 కోట్లు) పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఈ ఏడాది చివరకు మరో 15 జత చేసుకుని, విక్రయ కేంద్రాల సంఖ్య మొత్తం 160కి చేర్చాలని అనుకుంటున్నామ’ని ఫోక్స్‌ వ్యాగన్‌ కార్స్‌ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ ఆశిష్‌ గుప్తా వెల్లడించారు. కాగా, 2020లో ఈ కంపెనీ 5 సీట్ల సామర్థ్యం గల ఎస్‌యూవీ టీ-రాక్‌ను, 7 సీట్ల సామర్థ్యం గల ఎస్‌యూవీ టిగ్వాన్‌ ఆల్‌స్పేస్‌లను విడుదల చేసింది. ఈ రెండు మోడళ్లు మంచి విక్రయాలు నమోదు చేశాయని, విడుదల చేసిన 2 నెలల్లోనే ఉత్పత్తి చేసిన మొత్తం వాహనాలు అమ్ముడుపోయాయని ఆశిష్‌ వెల్లడించారు. ఈ జనవరిలోనూ గత ఏడాది జనవరితో పోలిస్తే 60 శాతం అధికంగా విక్రయాలు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌ రకం పోలో, సెడాన్‌ రకం వెంటోతో పాటు టీ-రాక్‌, టిగ్వాన్‌ ఆల్‌స్పేస్‌లను దేశీయంగా విక్రయిస్తోంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని