జీఎస్‌టీ రిటర్న్‌లో భారీ అవకతవకలుంటే రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌ - cancel the registration if there is any discrepancies in gst returns
close

Updated : 15/02/2021 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీఎస్‌టీ రిటర్న్‌లో భారీ అవకతవకలుంటే రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌

దిల్లీ: అమ్మకాల రిటర్న్‌ లేదా జీఎస్‌టీఆర్‌-1 ఫారంలో ఎక్కువ తేడాలు లేదా అవకతవకలు ఉంటే పన్ను చెల్లింపుదార్ల రిజిస్ట్రేషన్‌ను జీఎస్‌టీ అధికారులు వెంటనే సస్పెండ్‌ చేయనున్నారు. జీఎస్‌టీ పన్నుల ఎగవేత నిరోధానికి, ఆదాయాలను కాపాడుకునేందుకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) జారీ చేసిన తాజా నియమావళిలో ఈ ఆదేశాలు పొందుపరిచింది. తాజా నియమావళి ప్రకారం.. రిటర్న్‌లో అవకతవకలు ఉంటే పన్ను చెల్లింపుదార్ల రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్‌ చేస్తారు. అదే సమయంలో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ఫారం-31 రద్దు నోటీసు, సస్పెన్షన్‌ సమాచారాన్ని పన్ను చెల్లింపుదార్ల నమోదిత ఇ-మెయిల్‌ చిరునామాకు పంపుతారు. నమోదిత వ్యక్తి జీఎస్‌టీఆర్‌-1లో సరఫరా చేసిన వస్తువుల వివరాలకు, అందుకున్న వ్యక్తుల రిటర్నుల్లో అంకెలకు భారీ తేడా గుర్తించిన సందర్భంలో రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్‌ చేయనున్నారు. జీఎస్‌టీ పోర్టల్‌లో లాగిన్‌ అయిన తర్వాత ‘వ్యూ/నోటీస్‌ అండ్‌ ఆర్డర్‌’ ట్యాబ్‌పై నోటీసు వివరాలను పన్ను చెల్లింపుదార్లు చూసుకోవచ్చు.

ఇవీ చదవండి...

పాలసీదార్లకు డిజిటల్‌ పాలసీలు జారీ చేయండి

వాహన ధరలు ఇప్పుడే పెంచం: ఎంఎస్‌ఐ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని