close

Published : 05/03/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ టీకా నిల్వకు చిల్లర్‌మిల్‌

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 టీకా నిల్వ/ రవాణాకు వీలుకల్పించే చిల్లర్‌మిల్‌ను రాక్‌వెల్‌ ఇండస్ట్రీస్‌ ఆవిష్కరించింది. సౌర, పవన విద్యుత్తుతో పనిచేయడం దీని ప్రత్యేకత. ప్రపంచ ఆరోగ్య సంస్థ పీక్యూఎస్‌, కొవిడ్‌-19 ఫ్రీజర్‌ సిరీస్‌ ప్రమాణాల ప్రకారం రూపొందించిన ఈ చిల్లర్‌మిల్‌ను హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్‌ యూనిట్లో తయారుచేస్తున్నారు. దీన్ని నైపర్‌- హైదరాబాద్‌ ధ్రువీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం రోజుకు 1,000 చిల్లర్‌మిల్‌ యంత్రాలు తయారు చేయగల సామర్థ్యం ఉందని రాక్‌వెల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ అశోక్‌ గుప్తా వెల్లడించారు. ఒక్కో చిల్లర్‌మిల్‌ ధర రూ.40,000 నుంచి రూ.2.5 కోట్లు ఉంటుంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని