వేదాంతా లాభం రూ.4,280 కోట్లు - BUSINESS
close

Published : 27/07/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేదాంతా లాభం రూ.4,280 కోట్లు

దిల్లీ: జూన్‌ త్రైమాసికంలో వేదాంతా రూ.4,280 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం రూ.1,033 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా నాలుగింతలు కావడం విశేషం. మొత్తం ఆదాయం రూ.16,998 కోట్ల నుంచి రూ.29,151 కోట్లకు ఎగబాకింది. కంపెనీ వ్యయాలు రూ.14,965 కోట్ల నుంచి రూ.21,847 కోట్లకు చేరాయి. జూన్‌ ఆఖరుకు కంపెనీ నికర రుణం రూ.20,261 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో ఎన్నడూ లేనంతగా 549 కిలో టన్నుల (కేటీ) అల్యూమినియం ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. భారత్‌లో 236 కేటీ జింక్‌ ఉత్పత్తి చేసినట్లు, ఇది వార్షిక ప్రాతిపదికన 17 శాతం అధికమని పేర్కొంది. వెండి ఉత్పత్తి కూడా 37 శాతం పెరిగి 161 టన్నులకు చేరిందని వెల్లడించింది. ముడి ఇనుప ఖనిజం 1.4 మిలియన్‌ టన్నులు, ఉక్కు 289 కిలో టన్నుల మేర ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. ‘అన్ని వ్యాపారాల్లో వృద్ధి నమోదు కావడంతో మరో బలమైన త్రైమాసికాన్ని చూశాం. నిర్మాణాత్మక మార్పులు, సాంకేతికతను స్వీకరించడంతో వ్యయాలు తగ్గి, పరిమాణం పెరిగి అధిక ఆదాయం, నికర లాభాన్ని సాధించగలిగామ’ని వేదాంతా సీఈఓ సునీల్‌ దుగ్గల్‌ వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని