బజాజ్‌ ఎగుమతులు భేష్‌..! - Bajaj Auto Posts Over 1.26 Lakh Unit Sales In Domestic Market
close

Published : 03/05/2021 22:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బజాజ్‌ ఎగుమతులు భేష్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: బజాజ్‌ ఆటో ద్విచక్ర వాహన ఎగుమతులు ఏప్రిల్‌లో గణనీయంగా పెరిగాయి. ఈ విషయాన్ని ఆ సంస్థే ప్రకటించింది. కిందటి నెలలో దేశీయంగా 1,26,570 వాహనాలను విక్రయించగా.. మరో 2,21,603 వాహనాలను ఎగుమతి చేసింది. గతేడాది ఎగుమతి చేసిన 32,009 యూనిట్ల కంటే ఇది 592శాతం అధికం. మొత్తం మీద రెండో అత్యధిక ఎగుమతులు కూడా ఇవే అని బజాజ్‌ పేర్కొంది. ఏప్రిల్‌ మొత్తం కంపెనీ నుంచి 3,48,173 యూనిట్లు అమ్ముడుపోయినట్లైంది. 

ఇక అంతకుముందు నెల మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో దేశీయ విక్రయాలు తగ్గాయి. మార్చిలో మొత్తం 1,81,393 వాహనాలను దేశీయంగా విక్రయించింది. అదే సమయంలో మార్చితో పోలిస్తే ఎగుమతుల్లో మాత్రం 49శాతం వృద్ధి కనిపించింది. మార్చి2021లో బజాజ్‌ 1,48,740 వాహనాలను మాత్రమే ఎగుమతి చేసింది.  

వాణిజ్య వాహనాల విషయానికొస్తే.. ఏప్రిల్‌లో దేశీయంగా 7,901 యూనిట్లను విక్రయించగా.. 31,942 యూనిట్లను ఎగుమతి చేసింది. 2020లో ఈ విభాగంలో ఎగుమతులు కేవలం 5,869మాత్రమే కావడం గమనార్హం. ద్విచక్ర, కమర్షియల్‌ వాహనాల ఎగుమతులు కలిపితే బజాజ్‌ రెండో ఆల్‌టైమ్‌ అత్యధిక ఎగుమతులుగా నిలిచాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని