మార్కెట్‌లోకి బజాజ్‌ సీటీ110X - Bajaj Auto launches CT110X
close

Updated : 15/04/2021 20:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్‌లోకి బజాజ్‌ సీటీ110X

ముంబయి: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ మరో ద్విచక్ర వాహనాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సీటీ సిరీస్‌లో సీటీ 110X పేరుతో దీన్ని విడుదల చేసింది. ధర రూ.55,494(ఎక్స్‌ షోరూమ్‌ దిల్లీ). సీటీ సిరీస్‌లో ఇది టాప్‌ ఎండ్‌ వేరియంట్‌. 115సీసీ డీటీఎస్‌-ఐ ఇంజిన్‌, 7 కేజీల వరకూ బరువు మోసే క్యారియర్‌ను ఇందులో అమర్చారు. సెమీ నాబీ టైర్స్‌, స్వ్కేర్‌ ట్యూబ్‌, ఇంటిగ్రేటెడ్‌ ట్యాంక్‌ పాడ్స్‌ ఇతర ఫీచర్లు.

‘సీటీ 110X ద్వారా సుపీరియర్‌ ఫీచర్లు, అద్భుతమైన రైడింగ్‌ అనుభూతి, నాణ్యత, చక్కని మైలేజీ అందుతుంది. మా నుంచి మరో మంచి ఉత్పత్తిని వినియోగదారులకు అందిస్తున్నాం’ అని బజాజ్‌ ఆటో మోటర్‌సైకిల్‌ ప్రెసిడెంట్‌ సరంగ్‌ కన్నాడే తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని