Bajaj Finance FD: ఆన్‌లైన్‌లో బ‌జాజ్ ఫైనాన్స్ ‘ఎఫ్‌డీ’లు - Bajaj Finance offers high FD interest rates to investors
close

Updated : 16/09/2021 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bajaj Finance FD: ఆన్‌లైన్‌లో బ‌జాజ్ ఫైనాన్స్ ‘ఎఫ్‌డీ’లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ‌జాజ్ ఫైనాన్స్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు అధిక వ‌డ్డీ రావ‌డ‌మే కాకుండా దీనికున్న రేటింగ్‌ని బ‌ట్టి అధిక భ‌ద్ర‌త ప్ర‌యోజ‌నం కూడా ఉంది. ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు స్థిర‌మైన మూల‌ధ‌న ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబ‌డి పెట్టొచ్చు. నేడు చాలా మంది ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటున్నారు. దాదాపు 14% కొత్త పెట్టుబ‌డిదారులు ఆన్‌లైన్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించిన‌ట్లు సీఏఎంఎస్‌ అధ్య‌య‌నం తెలిపింది.

బ‌జాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ఇలా..

1. అధికారిక బ‌జాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి, ఇన్వెస్ట్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేయండి.

2. మొబైల్ నంబ‌ర్‌, పుట్టిన తేదీ, పిన్‌కోడ్‌ న‌మోదు చేయాలి.

3. ఓటీపీ రాగానే మీ మొబైల్ ద్వారా ధ్రువీకరణను పూర్తిచేయండి.

4. మీ ‘కేవైసీ’ వివ‌రాల‌ను నిర్ధారించండి. మీ కొత్త ఎఫ్‌డీని నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేయండి.

ఇలా మీరు మీ పెట్టుబ‌డి ప్ర‌యాణాన్ని ఆన్‌లైన్‌లో కొన్ని సుల‌భ‌మైన ద‌శ‌ల్లో ప్రారంభించొచ్చు. ఆన్‌లైన్ ప్ర‌క్రియ‌ను అనుస‌రించ‌డం సుల‌భం కాబట్టి సాంకేతిక ప‌రిజ్ఞానం అంత‌గా తెలియ‌ని వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బ‌జాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఆన్‌లైన్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక వ‌డ్డీ రేటు. బ‌జాజ్ ఫైనాన్స్ పెట్టుబ‌డిదారుల‌కు అధిక ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ పెట్టుబ‌డిదారులు కూడా అద‌న‌పు రేట్ల పెంపు నుంచి ప్ర‌యోజ‌నం పొందుతారు. ఆఫ్‌లైన్ ఎఫ్‌డీకి బేస్ రేటు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 6.75%, ఇత‌రుల‌కు 6.50%. ఈ వ‌డ్డీ రేటు క‌నీసం 36 నెల‌ల కాల‌ప‌రిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ల‌భిస్తుంది.

మీరు ఈ ఎఫ్‌డీని ఆన్‌లైన్‌లో నాన్‌-సీనియ‌ర్ సిటిజ‌న్‌గా బుక్ చేసుకుంటే, బేస్ రేటుపై అద‌నంగా 0.10% పొందుతారు. అంటే 36 నెల‌ల పాటు మీ ఎఫ్‌డీపై స‌వ‌రించిన వ‌డ్డీ రేటు 6.60%. ఈ మెరుగైన వ‌డ్డీ రేటు పెద్ద వ్య‌త్యాసాన్ని క‌లిగిస్తుంది. అధికంగా వేల రాబ‌డిని సంపాదించ‌వ‌చ్చు.

60 నెల‌ల కాల‌వ్య‌వ‌ధికి 5 ల‌క్ష‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు వ‌డ్డీ రేటు వివ‌రాలు..

ఆన్‌లైన్‌లో ఎక్కువ కాలం పాటు పెట్టుబ‌డి పెట్టే వ్య‌క్తి మెచ్యూరిటీ స‌మ‌యంలో అధిక రాబ‌డిని పొంద‌వ‌చ్చ‌ని ఈ ప‌ట్టిక చూపిస్తుంది. అంతేగాక ఎఫ్‌డీ ఆధారంగా ఆన్‌లైన్లో రుణం తీసుకోవ‌చ్చు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ ఎఫ్‌డీ విలువ‌లో 75% వ‌ర‌కు రుణంగా పొందొచ్చు.

అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు భ‌ద్ర‌త చాలా ముఖ్యం. బ‌జాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ ‘క్రిసిల్‌’ ఎఫ్ఏఏఏ రేటింగ్‌, ఇక్రా ఎంఏఏఏ రేటింగ్ ద్వారా గుర్తింపు పొందింది. రెండు రేటింగ్స్ మీ మూల‌ధ‌నానికి అధిక భద్రతను అందిస్తున్నాయి. ఈ రేటింగ్స్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, బ‌జాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ మంచి వ‌డ్డీ రేటును అందిస్తుంది. అదే స‌మ‌యంలో మీ డ‌బ్బు భ‌ద్ర‌త‌కు హామీ ఇస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని