మార్కెట్లోకి బజాజ్‌ కొత్త డామినర్‌.. లాంగ్‌ రైడ్‌కెళ్లే వారికోసం ప్రత్యేకంగా.. - Bajaj launches updated Dominar 400 tagged at Rs 2.16 lakh
close

Published : 25/10/2021 22:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లోకి బజాజ్‌ కొత్త డామినర్‌.. లాంగ్‌ రైడ్‌కెళ్లే వారికోసం ప్రత్యేకంగా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్‌.. కొత్త డామినర్‌ 400ను సోమవారం విడుదల చేసింది. దీని ధరను రూ. 2.16 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించింది. ఇంజిన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా దూర ప్రయాణాలు చేసే వారి సౌలభ్యం కోసం టూరింగ్‌ యాక్సెసరీస్‌లను ఫిట్‌చేసి అందిస్తున్నారు. చాలా మంది డామినర్‌ను దూర ప్రయాణాలకు వినియోగిస్తున్నారని, వారి అనుభవాలు తెలుసుకున్నాక టూరింగ్‌ ఉపకరణాలను అమర్చాలని నిర్ణయించినట్లు బజాజ్‌ ఆటో మార్కెటింగ్‌ హెడ్‌ నారాయణ్‌ సుందర రామన్‌ ఈ సందర్భంగా తెలిపారు. హ్యాండ్‌ గార్డ్స్‌, ఇంజిన్‌ బాస్‌ప్లేట్‌, లెగ్‌ గార్డ్‌, లగేజీ క్యారీయర్‌, బ్యాక్‌ రెస్ట్‌ను ఫ్యాక్టరీలోనే అమర్చారు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే కొత్త డామినర్‌ 373.3 సీసీ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 40 బీహెచ్‌పీ, 35Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అరోరా గ్రీన్‌, చార్‌కోల్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. నావిగేషన్‌ పరికరాన్ని అమర్చుకునేందుకు నావిగేషన్‌ మౌంట్‌ను అందిస్తున్నారు. యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ను కూడా ఇస్తున్నారు. దీంతో వాహనదారుడు ప్రయాణంలో తన మొబైల్‌ ఫోన్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. 2017లో లాంచ్‌ అయిన డామినర్‌ ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించకుంటూ వస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా లక్ష డామినర్‌ బైకులు అమ్ముడయ్యాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని