బ్యాంకులకు 4 రోజుల వరుస సెలవులు! - Bank branches closed for next 4 days
close

Updated : 13/03/2021 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకులకు 4 రోజుల వరుస సెలవులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా శనివారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. రెండు రోజులు సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా ఖాతాదారులకు సేవలు దూరం కానున్నాయి. మార్చి 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ బ్యాంకులు పనిచేయవు. 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి.

రెండు ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఒక ప్రభుత్వరంగ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో తొమ్మిది యూనియన్లతో కూడిన ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) సమ్మె తలపెట్టింది. 10 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మె కారణంగా ఎస్‌బీఐ, కెనరా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

ఇవీ చదవండి..

గృహరుణం.. వడ్డీ రేట్లు..

ఎన్‌పీఎస్‌ మంచి పథకమేనా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని