పార్లమెంట్‌ ఆమోదం దివాలా స్మృతి సవరణ బిల్లుకు - Bankruptcy Memorandum Amendment Bill passed by Parliament
close

Published : 04/08/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పార్లమెంట్‌ ఆమోదం దివాలా స్మృతి సవరణ బిల్లుకు

దిల్లీ: ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (సవరణ) బిల్లు-2021కు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. పెగాసస్‌ వివాదం, ఇతర సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నా, స్వల్ప చర్చతో బిల్లు ఆమోదం పొందింది. జులై 28న లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎస్‌ఎంఈలు) కోసం ముందుగా నిర్దేశించిన (ప్రీ-ప్యాకేజ్డ్‌) దివాలా పరిష్కార యంత్రాంగాన్ని దివాలా స్మృతి (సవరణ) బిల్లు 2021 అందిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈలను దృష్టిలో ఉంచుకుని దివాలా స్మృతికి సవరణలు చేసినట్లు వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని