ప్రారంభమైన బార్బెక్యూ నేషన్‌ ఐపీఓ - Barbeque Nation Hospitality Limited IPO
close

Updated : 25/03/2021 12:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రారంభమైన బార్బెక్యూ నేషన్‌ ఐపీఓ

దిల్లీ: రెస్టారెంట్ల నిర్వహణ సంస్థ బార్బెక్యూ నేషన్‌ హాస్పిటాలిటీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సబ్‌స్క్రిప్షన్‌ నేటి నుంచి ప్రారంభమైంది. 26న ముగియనుంది. ఈ ఐపీఓకు రూ.498-500 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ.180 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 54,57,470 షేర్లను సంస్థ విక్రయించనుంది. 

ఐపీఓకు ముందు ఎక్స్‌పొనెన్షియా కేపిటల్‌, జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌కు షేర్ల జారీ ద్వారా రూ.150 కోట్లను ఇప్పటికే బార్బెక్యూ సమీకరించింది. ఈ కంపెనీలో ప్రమోటర్లకు 60.24 శాతం, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సీఎక్స్‌ పార్ట్‌నర్స్‌కు 33.79 శాతం వాటా ఉంది. ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝన్‌వాలాకు చెందిన ఆల్కెమీ కేపిటల్‌కు కూడా 2.05 శాతం వాటా ఉంది. 

ఈ ఐపీవోకి సంబంధించిన కీలక వివరాలు..

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: మార్చి 24, 2021

♦  ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: మార్చి 26, 2021

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: ఏప్రిల్‌ 01, 2021

రీఫండ్‌ ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 5, 2021

♦  డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: ఏప్రిల్‌ 6, 2021

మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: ఏప్రిల్‌ 7, 2021

ముఖ విలువ: రూ.5 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

♦  లాట్‌ సైజు: 30 షేర్లు

♦  కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 30 షేర్లు (ఒక లాట్‌)

♦  గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 390 షేర్లు (13 లాట్లు)

♦  ఐపీవో ధర శ్రేణి: రూ.498 నుంచి రూ.500 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

సంస్థ వివరాలు..

బార్బెక్యూ నేషన్‌ను 2006లో నెలకొల్పారు. 2008లో తొలి రెస్టారెంట్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 73 పట్టణాల్లో ఈ సంస్థకు 147, యూఏఈ, ఒమన్‌, మలేసియాలలో 6 రెస్టారెంట్లు ఉన్నాయి. ఇటీవలే రెడ్‌ యాపిల్ పేరిట బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 ఇటాలియన్‌ రెస్టారెంట్లను ప్రారంభించారు. టాస్కానో రెస్టారెంట్‌, యూబీక్యూ కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఇక ఆర్థికపరంగా చూస్తే 2018-2020 మధ్య సంస్థ ఆదాయం 20 శాతం సీఏజీర్‌ చొప్పున పెరిగింది. కానీ, ప్రాఫిట్‌ ఆఫ్టర్‌ ట్యాక్స్‌ మాత్రం గత కొన్నేళ్లుగా నష్టాల్లో కొనసాగుతోంది. పైగా కరోనా సంస్థ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే, దీర్ఘకాలంలో మంచి వృద్ధి ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని