Stock Market: స్టాక్‌మార్కెట్లలో మళ్లీ బుల్‌ మెరుపులు - Benchmark indices ended on positive note
close

Updated : 25/11/2021 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: స్టాక్‌మార్కెట్లలో మళ్లీ బుల్‌ మెరుపులు

ముంబయి: దేశీయ మార్కెట్లలో గురువారం మళ్లీ లాభాల కళ కన్పించింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా రిలయన్స్‌ వంటి దిగ్గజ రంగ షేర్లలో కొనుగోళ్ల సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ మళ్లీ 17,500 మార్క్‌ను దాటింది.

నవంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టు ముగింపు నేపథ్యంలో మదుపర్ల అప్రమత్తతతో ఈ ఉదయం సూచీలు ఊగిసలాట ధోరణిలో మొదలయ్యాయి. 58,363 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ తొలి సెషన్‌లో కాస్త తడబడింది. అయితే ఆ తర్వాత రియల్టీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో నిలబడిన సూచీ లాభాల్లో పయనించింది. ఒక దశలో 600 పాయింట్ల వరకు ఎగబాకిన సూచీ.. చివరకు 454.10 పాయింట్ల లాభంతో 58,795.09 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 121.30 పాయింట్లు లాభపడి 17,536.30 వద్ద స్థిరపడింది. 

దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. ఫార్మా, రియల్టీ సూచీ ఒకశాతం మేర లాభపడింది. అయితే ఆటో, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో మాత్రం అమ్మకాలు కన్పించాయి. నిఫ్టీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, దివిస్‌ ల్యాబ్స్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడగా.. బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని