ఒడుదొడుకులున్నా.. లాభాల్లోనే - Benchmark indices witnessed volatile session but end high
close

Updated : 15/04/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒడుదొడుకులున్నా.. లాభాల్లోనే

ముంబయి: దేశంలో కరోనా కల్లోలంతో ఇటీవల భారీ నష్టాలను చవిచూసిన స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా రెండో రోజు లాభాలను దక్కించుకున్నాయి. గురువారం నాటి సెషన్‌లో సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 14,500 మార్క్‌ను దాటింది. 

భారత్‌లో కరోనా కొరతను అధిగమించేందుకు గానూ విదేశీ టీకాలకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు ప్రకటించిన కేంద్రం నిర్ణయంతో గత సెషన్‌లో జోరుగా సాగిన సూచీలు.. నేడు కూడా అదే ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. 48,512 పాయింట్లతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌.. ఆరంభంలో కాస్త ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఒక దశలో 48,010.55 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అయితే లోహ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో మళ్లీ పుంజుకున్న సూచీ  48,887 పాయింట్ల  గరిష్ఠాన్ని తాకింది. చివరకు 259.62 పాయింట్ల లాభంతో 48,803.68 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 76.70 పాయింట్లు లాభపడి 14,681.50 వద్ద ముగిసింది. 

నిఫ్టీలో టీసీఎస్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, విప్రో, అదానీ పోర్ట్స్‌ షేర్లు రాణించగా.. ఐషర్‌ మోటార్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, మారుతి సుజుకీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. లోహ, ఫార్మా రంగాల షేర్లు ఒక శాతం మేర లాభపడగా.. బ్యాంకింగ్, ఆటో షేర్లు నష్టాలను చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని