గృహ రుణ రేట్ల త‌గ్గింపుతో మీరు ప్ర‌యోజ‌నం పొందుతారా?   - Benefit-from-home-loan-rate-cuts
close

Updated : 04/03/2021 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 గృహ రుణ రేట్ల త‌గ్గింపుతో మీరు ప్ర‌యోజ‌నం పొందుతారా? 

రూ.75 లక్షల వరకు రుణాలపై ఎస్‌బీఐ గృహ రుణ రేట్లను 6.7 శాతానికి తగ్గించగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆఫర్ 6.65 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మహిళా రుణగ్రహీతలకు ఎస్‌బీఐలో ఇంకా 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును మార్చి 4 నుంచి 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

రేటు తగ్గింపు నుంచి రుణగ్రహీతలు ఎలా లాభపడతారు?

వడ్డీ రేటు తగ్గింపు రుణాలు తీసుకునేవారి ఖర్చును తగ్గిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి 15 సంవత్సరాల గ‌డువుతో 7 శాతం చొప్పున రూ. 50 లక్షల గృహ రుణాన్ని పొందినట్లయితే, ఈఎంఐ రూ. 44,941 అవుతుంది, మొత్తం గ‌డువు ముగిసేస‌రికి వ‌డ్డీ మొత్తం రూ.30.89 లక్షలు అవుతుంది. వడ్డీ రేటును 6.75 శాతానికికి తగ్గించినట్లయితే, ఈఎంఐ రూ. 44,245 అవుతుంది. వడ్డీ భాగం రూ.29.64 లక్షలకు తగ్గుతుంది. రేటు త‌గ్గితే  గ‌డువును కూడా త‌గ్గించుకోవ‌చ్చు.  అదే ఈఎంఐని చెల్లించడం కొనసాగించవచ్చు. రేటు తగ్గిన‌ప్పుడు ఈఎంఐని త‌గ్గించ‌కుండా గ‌డువును త‌గ్గించుకుంటే అద‌నంగా పొదుపు చేసుకోవ‌చ్చు.

తక్కువ రేట్ల నుంచి ఎవరు ప్రయోజనం పొందుతారు?

ఈ రేట్లు కొత్త రుణగ్రహీతలకు వ‌ర్తిస్తాయి. ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు కాదు.  ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించినట్లయితే ప్రస్తుత రుణగ్రహీతలు ప్రయోజనం పొందవచ్చు, ఎందుకంటే బ్యాంకులు గృహ రుణ రేట్లను 1 అక్టోబర్ 2019 నుంచి ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్‌లతో అనుసంధానించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. చాలా బ్యాంకులు రెపో రేట్లను  బెంచ్‌మార్క్‌గా ఎంచుకున్నాయి. రెపో రేటు ఆదారిత‌ గృహ రుణం రెపో రేటు ప్ర‌కారం లెక్కిస్తారు.

అతి తక్కువ గృహ రుణ రేటు పొందటానికి ఎవరు అర్హులు?

అతి తక్కువ గృహ రుణ రేటుకు బ్యాంకులకు అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ఉదాహరణకు, యోనో యాప్‌లో రూ. 30 లక్షల వరకు రుణ దరఖాస్తులు చేసుకున్న, వేత‌నం ఉన్న‌  ఉన్న మహిళలకు ఎస్‌బీఐ 6.6 శాతం తక్కువ రేటును అందిస్తుంది. జీతం ఉన్న పురుషుల‌కు ఇది 6.65 శాతం లేదా 6.7 శాతం వద్ద లభిస్తుంది. రుణగ్రహీత క్రెడిట్ స్కోరు కూడా గృహ రుణ రేట్లను నిర్ణయిస్తుంది.

ఏ బ్యాంకును ఎంచుకోవాలి?

మీ రుణదాత అధిక రుణ రేటును వసూలు చేస్తుంటే, వేరే బ్యాంకుకు రుణాన్ని  బదిలీని ఎంచుకోవచ్చు. అయితే వ‌డ్డీ రేటులో వ్య‌త్యాసం క‌నీసం 50 బీపీఎస్ త‌క్కువ‌,  గ‌డువు 10 సంవత్సరాలు ఉంటేనే బ‌దిలీ చేసుకోవ‌డం మంచిద‌ని నిపుణుల స‌ల‌హా.  ఏదేమైనా, బదిలీని ఎంచుకునే ముందు స్టాంప్ డ్యూటీ, ప్రాసెసింగ్ ఫీజుతో సహా ఛార్జీలను కూడా చూడాలి, ఇది రుణ మొత్తంలో 1 శాతం  ఉంటుంది. కొన్ని బ్యాంకులు డాక్యుమెంటేషన్, లీగల్, వాల్యుయేషన్, టెక్నికల్ ఫీజులను కూడా వసూలు చేస్తాయి. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు ప్రాంతాన్ని బ‌ట్టి మారుతాయి.

బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఏది ఎంచుకోవాలి?

కొన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు  పోటీ ప‌డి మ‌రీ త‌క్కువ వ‌డ్డీ రేట్లు అందిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకులతో పోలిస్తే ఇవి తక్కువ కఠినమైన ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలు ప్రైమ్ లెండింగ్ రేట్ (పిఎల్‌ఆర్) ఆధారంగా గృహ రుణాలను అందిస్తాయి. వడ్డీ రేట్లు ఏ ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానం కావు. అందువల్ల, బ్యాంకులు అందించే గృహ రుణాలతో పోల్చినప్పుడు వడ్డీ రేటు మార్పులు ఎన్‌బీఎఫ్‌సీ విషయంలో వేగంగా, పారదర్శకంగా ఉండకపోవచ్చు. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న‌ రుణగ్రహీతలకు ఎన్‌బీఎఫ్‌సీల వ‌ద్ద సుల‌భంగా రుణాలు ల‌భిస్తాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని