కొవాగ్జిన్‌ వినియోగ గడువు పెంపునకు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు! - Bharat Biotech seeks DCGIs nod to extend shelf life
close

Updated : 26/04/2021 07:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 కొవాగ్జిన్‌ వినియోగ గడువు పెంపునకు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు!

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ వినియోగ గడువు(షెల్ఫ్‌ లైఫ్‌)ను పొడిగించుకోవడానికి భారత ఔషధ నియంత్రణాధికార సంస్థ డీసీజీఐ అనుమతులను ఆ కంపెనీ కోరింది. ప్రస్తుతమున్న 6 నెలల వ్యవధి నుంచి 24 నెలలకు పెంచాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2-8 డిగ్రీల సెల్సియస్‌లో నిల్వ ఉంచిన కొవాగ్జిన్‌ను తయారు చేసిన తేదీ నుంచి ఆరు నెలల పాటు విక్రయించడానికి, పంపిణీ చేయడానికి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ‘కొవాగ్జిన్‌ షెల్ఫ్‌ లైఫ్‌ను 6 నెలల నుంచి 24 నెలలకు పెంచమని కోరుతున్నామ’ని కంపెనీ డీసీజీఐకి రాసిన లేఖలో పేర్కొనట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనకు మద్దతుగా కొవాగ్జిన్‌కు సంబంధించి తాజా యాక్సిలరేటెడ్‌, రియల్‌ టైం స్టెబిలిటీ డేటాను సమర్పించినట్లు తెలుస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని