బిగ్‌బజార్‌ నుంచి ఇన్‌స్టంట్‌ హోమ్‌ డెలివరీ - Big Bazaar introduces instant delivery service aims 1 lakh orders per day
close

Updated : 01/04/2021 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిగ్‌బజార్‌ నుంచి ఇన్‌స్టంట్‌ హోమ్‌ డెలివరీ

దిల్లీ: ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన బిగ్‌బజార్‌ ఇన్‌స్టంట్‌ హోమ్‌ డెలీవరీ సేవలను ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఉత్పత్తులను కేవలం 2 గంటల్లోనే వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు బిగ్‌బజార్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్యాషన్‌, ఫుడ్‌, ఎఫ్‌ఎంసీజీ ఇలా గృహావసరాలకు సంబంధించిన వస్తువులను దగ్గర్లోని స్టోర్ల నుంచి అందజేస్తామని తెలిపింది. మొబైల్‌ యాప్‌ లేదా పోర్టల్‌ నుంచి ఆర్డర్‌ చేయొచ్చని పేర్కొంది.

ప్రస్తుతం దిల్లీ రాజధాని ప్రాంతం సహా ముంబయి, బెంగళూరు నగరాల్లో తొలి విడతగా ఈ సేవలు ప్రారంభించింది. రాబోయే 45 రోజుల్లో ఈ సేవలను 21 నగరాలకు విస్తరించాలని ప్రణాళికగా పెట్టుకున్నట్లు ఆ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ (ఫుడ్‌ అండ్‌ ఎఫ్‌ఎంసీజీ) కమల్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. రాబోయే ఐదారు నెలల్లో అన్ని బిగ్‌ బజార్‌ స్టోర్ల నుంచి ఈ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో రోజుకు లక్ష ఆర్డర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కనీసం రూ.500 కొనుగోలుపై ఈ సేవలు అందనున్నాయి. వెయ్యి రూపాయల వరకు వస్తువుల కొనుగోలుపై రూ.49 డెలివరీ ఛార్జీ వర్తిస్తుందని, ఆపై కొనుగోళ్లకు ఉచితంగా డెలీవరీ చేస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం బిగ్‌ బజార్‌కు 150 నగరాల్లో 280 స్టోర్లు ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని