close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/07/2020 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విదేశీ ఈ-కామర్స్‌ కంపెనీలకూ చెక్‌?

దేశీయ సంస్థలను ప్రోత్సహించేలా సరికొత్త విధానం

దిల్లీ: స్వయంసమృద్ధి చెందిన భారతావనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చైనా యాప్‌లను నిషేధించిన ప్రభుత్వం.. వాటికి దీటుగా దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయాలని సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ-కామర్స్‌ రంగంలోనూ దేశీయ కంపెనీలకు పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు త్వరలో ఓ సరికొత్త ఈ-కామర్స్‌ విధానాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అల్ఫాబెట్‌వంటి విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించాలన్న డిమాండ్‌ వినిపిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలకు సమాయత్తమైనట్లు సమాచారం. అలాగే ఆయా కంపెనీలు సమాచారాన్ని ఎలా నిర్వహిస్తున్నాయనే అంశంపై నిత్యం ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగేలా నిబంధనల్లో సవరణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ ముసాయిదా రూపొందించిందని.. ఈ కొత్త విధానం రెండేళ్లపాటు అమల్లో ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

కొత్త విధానం ప్రకారం.. ఈ-కామర్స్‌ సంస్థలపై నియంత్రణ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆయా కంపెనీల వద్ద ఉన్న సమాచారాన్ని పొందేందుకు ఈ వ్యవస్థకు అధికారాలు ఉండనున్నాయి. అవసరమైతే ఆన్‌లైన్ కంపెనీల సోర్స్‌ కోడ్‌లు, ఆల్గారిథమ్‌లను కూడా ప్రభుత్వం పొందేలా మార్పులు చేస్తున్నారు. తద్వారా కంపెనీల మధ్య ఉండే ‘డిజిటల్‌ ప్రేరేపిత పక్షపాతాల్ని’ తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కామర్స్‌ సంస్థల వద్ద అవసరమైన కృత్రిమ మేథ ఉందో.. లేదో.. కూడా ధ్రువీకరించే హక్కు ప్రభుత్వానికి ఉండనుంది. 

దేశం క్రమంగా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపై పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు బడా సంస్థలు ఆయా రంగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ రిటైలింగ్‌, స్ట్రీమింగ్‌, మేసేజింగ్‌, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి రంగాల్లో స్థానిక కంపెనీలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సమాచార స్థానికీకరణ విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.