Biocon Q2 Results: బయోకాన్‌ లాభం రూ.138 కోట్లు - Biocon consolidated net profit dips 18 pc to Rs 138
close

Published : 22/10/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Biocon Q2 Results: బయోకాన్‌ లాభం రూ.138 కోట్లు

దిల్లీ: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.138 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.169 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం తక్కువ. ఏకీకృత ఆదాయం రూ.1,750 కోట్ల నుంచి రూ.1,840 కోట్లకు పెరిగింది. కరోనా నుంచి కార్యకలాపాలు పుంజుకోవడం, సరఫరా గొలుసులోని ఇబ్బందులు తొలగిపోతున్న నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధంలో సంస్థ మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా పేర్కొన్నారు. వ్యాక్సిన్లు, వివిధ రకాల జబ్బులకు యాంటీబాడీల తయారీ రంగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో తమ అనుబంధ సంస్థ బయోకాన్‌ బయోలాజిక్స్‌కు భవిష్యత్తుల్లో మెరుగైన వృద్ధి ఉండనుందని సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కూడా కుదిరినట్లు పేర్కొంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని