60వేల డాలర్లు దాటిన బిట్‌కాయిన్‌..! - Bitcoin hits another record leaves other asset classes trailing
close

Published : 14/03/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

60వేల డాలర్లు దాటిన బిట్‌కాయిన్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ మరోసారి సత్తాచాటింది. నేడు అత్యధికంగా 61,080 డాలర్ల మార్కును దాటేసింది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.44.39 లక్షలన్నమాట. ఫిబ్రవరి నెల చివర్లో భారీగా విలువ కోల్పోయిన బిట్‌కాయిన్‌ ఈ నెలలో పుంజుకొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడం బిట్‌కాయిన్‌ మార్కెట్‌కు మంచి ఊపునిచ్చింది.

గత డిసెంబర్‌ చివర్లో బిట్‌కాయిన్‌ 170శాతం పెరిగి 29వేల డాలర్లకు చేరింది. ఫిబ్రవరి నాటికి దాదాపు 57వేల డాలర్ల మార్కును దాటేసింది. కానీ, ఆ తర్వాత భారీగా పతనమై 45 వేల డాలర్లకు చేరింది. కానీ, మళ్లీ క్రమంగా పుంజుకొని తాజాగా కొత్త జీవన కాల గరిష్ఠాన్ని తాకింది. బిట్‌కాయిన్‌ వచ్చిన కొత్తల్లో ఇది కేవలం కొన్ని సెంట్స్‌ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు కూడా క్రిప్టో కరెన్సీలపై ఆసక్తి చూపించడం బిట్‌కాయిన్‌కు కలిసొచ్చింది. దీనిని బంగారం, ద్రవ్యోల్బణాన్ని హెడ్జ్‌ చేయడానికి విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. బిలియనీర్లు మస్క్‌, మైక్‌ నోవగ్రట్జ్‌ వంటి వారు వీటిపై ఆసక్తి చూపడం కలిసొచ్చే అంశంగా మారింది.

ఇవీ చదవండి

కొత్తగా 66 విమాన సర్వీసులు

ఇండో-పసిఫిక్‌కు భారత్‌ ఓ భరోసా!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని