బడ్జెట్‌ వేళ.. పసిడి, వెండి ధరలు ఇలా... - Boolean prices on the Budget Day 2021
close

Published : 01/02/2021 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌ వేళ.. పసిడి, వెండి ధరలు ఇలా...

ముంబయి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు 11 గంటలకు 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ కీలకమైన రోజు దేశంలో బంగారం, వెండి ధరలు గోల్డ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ అందించిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. భారత్‌లో 22 కేరట్ల పసిడి ధర పది గ్రాములకు రూ.47,970 కాగా.. 24 కేరట్లు రూ.48,970 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుత ధర కిలోకు రూ.69,800 ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఆదివారం  22, 24 కేరట్ల బంగారం ధరలు వరుసగా రూ.47,960,  రూ.48,960 ఉండటం గమనార్హం.

ఐతే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఎక్సైజు డ్యూటీ, రాష్ట్ర పన్నులు, మజూరీ తదితర అంశాలను అనుసరించి బంగారు ఆభరణాల ధరలో స్వల్ప భేదాలు ఉండవచ్చు. ఈ మేరకు దేశంలోని నాలుగు ముఖ్య నగరాల్లో 22 కేరట్లు, 24 కేరట్ల బంగారం ధరలు పది గ్రాములకు గాను ఇలా ఉన్నాయి:

  • దిల్లీ: రూ. 47,970- రూ. 52,320
  • ముంబయి: రూ. 47,970- రూ. 48,970
  • చెన్నై: రూ. 46,570- రూ. 50,790
  • కోల్‌కతా: రూ. 48,340- రూ. 51,040

అదేవిధంగా వెండి కిలో ధర దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాల్లో రూ. 69,800 ఉండగా.. చెన్నైలో మాత్రం రూ. 74, 600గా ఉంది.

ఇదీ చదవండి..

సొంతింటి కలకు గడువు పెంచుతారా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని