close

తాజా వార్తలు

ఈ రకంగా చూస్తే.. పన్నుకోత ఖాయమే..!

 జనరంజక బడ్జెట్‌తోనే డిమాండ్‌కు ఊతం

ఇంటర్నెట్‌డెస్క్‌: 2020 బడ్జెట్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ప్రధాని మోదీలకు పెను సవాలే. గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలను కనుక పెంచకపోతే ఆ ప్రభావం మిగిలిన రంగాలపై పడి ఆర్థిక వ్యవస్థ మరింత వెనక్కి పోయే ప్రమాదం ఉంది. దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం వ్యయాలను, పన్నుకోతలను పెంచవచ్చు. ఈ బడ్జెట్‌ మొత్తం వినియోగదారుల డిమాండ్‌ను పెంచడం.. పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా సాగనుంది. భారత్‌ గత పదేళ్లలో ఎన్నడు లేనంత తక్కువగా ఆర్థిక వృద్ధిరేటును సాధించింది. జులై-సెప్టెంబర్‌ మధ్యలో జీడీపీ 4.5శాతానికి దిగజారింది. ఇక ఉద్యోగాల కొరతతో కొత్తగా పట్టాలు చేతపట్టుకొని వచ్చే యువతకు ఉద్యోగాలు కరవైపోయాయి. 
ఇప్పటికే ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును భారీగా తగ్గించింది. దీంతోపాటు ఆర్‌బీఐ వడ్డీరేట్లను ఐదుసార్లకు పైగా తగ్గించింది. అయినా ఫలితం ఇవ్వలేదు. మరోపక్క పెట్టుబడులు కూడా ఊపందుకోలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రజలకు ఆర్థిక ఉపశమనాలు కల్పించడంతో పాటు రోడ్లు, రైలు, గ్రామీణ సంక్షేమంపై భారీ మొత్తం వెచ్చించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థికరంగం పురోగమనానికి తాయిలాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కార్పొరేట్‌ పన్ను తగ్గించడంతో.. ఆదాయపు పన్ను ఈ సారి బడ్జెట్‌లో తగ్గిస్తారని భావిస్తున్నారు. 
ఇప్పటికే ఐఎంఎఫ్‌ భారత్‌లో వృద్ధిరేటును 4.8శాతంగా పేర్కొంది. వచ్చే ఏడాది కూడా 5.8శాతం వృద్ధి రేటు నమోదవుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ద్రవ్యలోటు తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పన్ను ఆదాయం అనుకున్న దానికన్నా రూ.3లక్షల కోట్లు తక్కువగా వచ్చింది. దీంతో ఈ సారి ఆర్థిక మంత్రి ద్రవ్యలోటు పెంచవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది జీడీపీలో అత్యధికంగా 3.6శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. 

ఇన్ఫ్రా  ప్రాజెక్టులను ప్రారంభించే అంశంపై ఇప్పటికే మార్కెట్లు భారీగా ఆశలు పెట్టుకొన్నాయి. దాదాపు 1.48 ట్రిలియన్‌ డాలర్ల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికను ఈ బడ్జెట్‌లోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ పయనాన్ని  ఇది వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. వీటితోపాటు ఎయిర్‌ ఇండియా విక్రయాలకు సంబంధించిన కీలక విషయాలను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు దాదాపు 50 రకాల వస్తువులపై పన్నులు, సుంకాలను పెంచే అవకాశం ఉంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, రసాయినాలు వంటి  56 బిలియన్‌ డాలర్లు విలువైన దిగుమతులకు కారణమయ్యేవి ఉన్నాయి.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.