1.2 బిలియన్‌ డాలర్లు ఇప్పించండి..! - Cairn CEO to meet finance secretary on Thursday
close

Updated : 17/02/2021 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1.2 బిలియన్‌ డాలర్లు ఇప్పించండి..!

 భారత ప్రభుత్వంపై కెయిర్న్‌ ఎనర్జీ కేసు

ఇంటర్నెట్‌డెస్క్‌: హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌ కోర్టు) ఆదేశాల మేరకు తమకు భారత ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్‌ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్‌ ఎనర్జీ అమెరికాలోని ఓ న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఆంగ్ల వార్త సంస్థ రాయిటార్స్‌ పేర్కొంది.  భారత ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ డిసెంబర్‌లో ఆర్బిట్రేషన్‌ న్యాయస్థానం కెయిర్న్‌ ఎనర్జీకి అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్బిట్రేషన్‌ తీర్పును గుర్తిస్తూ చక్రవడ్డీతో సహా పరిహారాన్ని ధ్రువీకరించాలని తాజాగా అమెరికాలో డిస్ట్రిక్ట్‌ కోర్టును ఆశ్రయించింది. 

భారత ప్రభుత్వం నుంచి జరిమానా వసూలు చేయడానికి కెయిర్న్‌  ఎనర్జీ వేసిన తొలి అడుగుగా దీనిని భావించవచ్చు.  ఒక వేళ భారత ప్రభుత్వం ఈ సొమ్ము చెల్లించకపోతే అక్కడ ఉన్న దేశ ఆస్తులను సీజ్‌ చేసి మరీ వసూలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కేసును కెయిర్న్‌ గెలిస్తే విదేశాల్లో .. ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారత్‌ ఆస్తులను సీజ్‌ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. భారత ప్రభుత్వానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను గత నెలలో కెయిర్న్‌ ఎనర్జీ గుర్తించింది. వీటిల్లో బ్యాంక్‌ ఖాతాలు, ఎయిర్‌ ఇండియా విమానాలు, భారతీయ నౌకలు వంటివి ఉన్నాయి. యుకే,నెదర్లాండ్స్‌ న్యాయస్థానాల్లో కూడా ఇటువంటి పిటషన్లననే దాఖలు చేసింది. 

రేపు ఆర్థికశాఖ కార్యదర్శితో కెయిర్న్‌ సీఈవో భేటీ

కెయిర్న్‌ ఎనర్జీ సీఈవో సైమన్‌ థామ్సన్‌ రేపు ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌  పాండేతో భేటీ కానున్నారు. అర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాలపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే థామ్సన్‌ ఆర్థిక మంత్రితో భేటీ అయ్యేందుకు కూడా అపాయింట్‌మెంట్‌ కోరారు.  

దీనిపై ఇప్పటికే నేడు ఇంటర్‌ మినిస్టీరియల్‌ గ్రూప్‌ బుధవారం భేటీకానుంది. మార్చి 10వ తేదీలోపు భారత్‌ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై సీనియర్‌ డచ్‌ లాయర్లతో చర్చలు జరుపుతోంది. అప్పీలుకు వెళ్లేందుకు భారత్‌కు మార్చి 21వరకు గడువు ఉంది. భారత సార్వభౌమాధికారం ఉన్న చోట్ల పన్ను విషయాలు ప్రభుత్వమే నిర్ణయిస్తుందికానీ, ప్రైవేటు వ్యక్తులు కాదని వాదించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

కేసు ఇదీ..

2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ  ‘కెయిర్న్‌‌ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.

దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. దీంతో 1.2 బిలియన్‌ డాలర్లు కెయిర్న్‌కు చెల్లించాలని తీర్పు వెలువడింది. 

ఇదీ చదవండి

కరోనాపై కంగారూ వర్సెస్‌ డ్రాగన్‌..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని