కొవిడ్‌ను ఎదుర్కోడానికి నగదు ముద్రించం - Cash printing to deal with covid Union Finance Minister Nirmala Sitharaman‌
close

Published : 27/07/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ను ఎదుర్కోడానికి నగదు ముద్రించం

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 

ఈనాడు, దిల్లీ: కరోనా పరిణామాలతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి నగదు ముద్రించే ఉద్దేశమేమీ ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టంచేశారు. ‘2020-21లో  జీడీపీ 7.3% మేర తగ్గుతుందనే అంచనాలున్నాయి. కొవిడ్‌ మహమ్మారి పరిణామాలు, వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కట్టడి చర్యలే ఇందుకు కారణం. దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కారణంగా ఆర్థిక వ్యవస్థ 2020-21 రెండో అర్ధభాగం నుంచి మళ్లీ పుంజుకుంటోంది. ప్రజారోగ్యం, వృద్ధి, ఉపాధికల్పన  కోసం ఈ ఏడాది జూన్‌లో కేంద్రం రూ.6.29 లక్షల ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది’’ అని మంత్రి వివరించారు. 

దివాలా స్మృతి సవరణకు బిల్లు: ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ముందస్తుగా సిద్ధంచేసిన పరిష్కార ప్రణాళిక అందించేలా దివాలా స్మృతికి సవరణ బిల్లును ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రూ.కోటికి మించని ఎగవేతలకు ఇది వర్తిస్తుంది. ఏప్రిల్‌ 4న ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌ స్థానంలో తాజా బిల్లు వల్ల చట్టం రూపొందుతుంది. దివాలాకు చేరిన ఎంఎస్‌ఎంఈపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించడానికి ముందే, రుణదాతలు-వాటాదార్లు కలిసి అర్హత కలిగిన కొనుగోలుదారును గుర్తించేందుకు తాజా సవరణ వీలు కల్పిస్తుంది. అయితే అన్ని పరిష్కార ప్రణాళికలను ఎన్‌సీఎల్‌టీ ఆమోదించాల్సిందే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని