ఆధార్‌- పాన్‌ అనుసంధానం గడువు పొడిగింపు - Central Government extends the last date for linking of Aadhaar number with PAN
close

Published : 31/03/2021 20:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆధార్‌- పాన్‌ అనుసంధానం గడువు పొడిగింపు

దిల్లీ: ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం గడువును కేంద్రం పొడిగించింది. కొవిడ్‌ నేపథ్యంలో వీటిని లింక్‌ చేసేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. జూన్‌ 30 వరకు అనుసంధానం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అంతకుముందు మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇస్తున్నట్లు పేర్కొన్న కేంద్రం.. ఆ లోగా లింక్‌ చేయకపోతే వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని