ప్రైవేటు బ్యాంకులకూ ప్రభుత్వ వ్యాపారం - Centre Lifts Embargo On Granting Businesses To Private Banks
close

Updated : 24/02/2021 18:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు బ్యాంకులకూ ప్రభుత్వ వ్యాపారం

దిల్లీ: ప్రభుత్వ వ్యాపారాన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా నిర్వహించే వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. దీంతో ప్రైవేటు బ్యాంకులు కూడా అన్ని అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొనే వీలు కలగనుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ వ్యాపారాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులే నిర్వహించాలన్న నిబంధనను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని బ్యాంకులూ ప్రభుత్వరంగ కార్యకలాపాల్లో పాల్గొనొచ్చని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగ బ్యాంకులు సైతం భాగమేనంటూ ఆమె బుధవారం ట్వీట్‌ చేశారు.

ఇప్పటి వరకు ప్రభుత్వ రంగానికి చెందిన పన్నులు, పింఛన్ల చెల్లింపు, చిన్నతరహా పొదుపు వంటి బ్యాంకింగ్‌ లావాదేవీలు ప్రభుత్వ రంగ బ్యాంకులే నిర్వహించేవి. కొన్ని ప్రైవేటు బ్యాంకులకు మాత్రమే అనుమతి ఉండేది. తాజాగా ఆ నిబంధనను తొలగించారు. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కొత్త తరహా బ్యాంకింగ్‌, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే ప్రైవేటు రంగ బ్యాంకులు ఇకపై భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో పాటు ప్రభుత్వం చేపట్టే సామాజికరంగ కార్యకలాపాల్లో భాగం కానున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు కేంద్రం తన నిర్ణయాన్ని ఆర్‌బీఐకి తెలియజేసింది. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌లో ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లు ఎగిశాయి.

ఇవీ చదవండి..

క్రిప్టోకరెన్సీపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వ్యాఖ్యలు!

పునఃప్రారంభం తర్వాత మార్కెట్ల జోరు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని