నిర్మ‌లా సీతారామ‌న్ చేతిలో బ‌డ్జెట్ వ్యాక్సిన్‌ - Challenges-before-budget-2021
close

Published : 01/02/2021 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మ‌లా సీతారామ‌న్ చేతిలో బ‌డ్జెట్ వ్యాక్సిన్‌

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఒక మహమ్మారి, స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో తీవ్ర న‌ష్టం, నాలుగు దశాబ్దాలలో మొదటిసారి వార్షిక  సంకోచం , ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక కోవిడ్-19 కేసులు, మిలియన్ల ఉద్యోగాలు కోల్పోవ‌డం, వేర్వేరు రంగాలలో క్షీణ‌త‌, నెమ్మదిగా కోలుకున్న కొన్ని రంగాలు.. ఇవన్నీ మ‌నం 2020 సంవ‌త్స‌రంలో చూశాం

ఫిబ్రవరి 1 న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2021-22 ను సమర్పించబోతున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎదుర్కొంటున్న వాస్తవికత ఇదే. ఆమె చేసిన అన్ని ప్రకటనలు,  చర్యల వెనుక ఒకే  అంతిమ లక్ష్యం: అదే భారతదేశాన్ని పునరుద్ధరించడం, మునుప‌టి ద‌శ‌కు తీసుకురావ‌డం.

మన్మోహన్ సింగ్ సమర్పించిన 1991 బడ్జెట్ కంటే అతి ముఖ్యమైన బడ్జెట్ ఇది. ఎందుకంటే సీతారామన్ కంటే ముందు ఉన్న ఆర్థిక మంత్రులు - అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ - వారి స‌మ‌యంలో అనేక ఆర్థిక స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ఇప్పుడు ఉన్న ప‌రిస్థితి చాలా క్లిష్ట‌మైన‌ది అని చెప్పుకోవ‌చ్చు.

గత సంవత్సరం భారతదేశం  లాక్‌డౌన్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా ప్రారంభ‌మ‌య్యాయి. కొన్ని కీలక సూచికలు, సెప్టెంబర్- అక్టోబర్ నాటికి, 2019-20 నుంచి అంచ‌నా వేసిన  డేటాను సరిపోల్చాయి లేదా అధిగమించాయి. ఏదేమైనా నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి డేటా ప్ర‌కారం ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రీ అంత దీన‌స్థితికి వెళ్ల‌లేద‌ని అర్థ‌మైంది.

 ప్ర‌జ‌ల్లో పెరిగిన చైతన్యంతో పాటు పెరుగుతున్న కోవిడ్‌-19 కేసులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరుగుతున్న‌ప్ప‌టికీ భార‌త్‌లో త‌గ్గుముఖం ప‌ట్ట‌డం మంచి ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు. చాలా బ్యాంకులు, రేటింగ్ ఏజెన్సీలు, సంస్థలు 2021 ఆర్థిక సంవ‌త్స‌రం కోసం వారి జీడీపీ అంచ‌నాల‌ను త‌గ్గించాయి. మ‌రోవైపు  అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ‌ (ఐఎంఎఫ్) 2022 ఆర్థిక సంవ‌త్స‌రానికి  భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని