Stock Market: ఆద్యంతం ఒడుదొడుకులమయం! - Choppy trade for markets today
close

Published : 23/04/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: ఆద్యంతం ఒడుదొడుకులమయం!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల ప్రయాణం శుక్రవారం ఆద్యంతం ఒడుదొడుకులమయంగా సాగింది. ఉదయం 47,863 వద్ద బలహీనంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ క్రమంగా పుంజుకుని 48,265 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీ మళ్లీ నష్టాల్లో జారకుని 47,669 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 202 పాయింట్ల నష్టంతో 47,878 వద్ద ముగిసింది. ఇదే ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ 14,326 వద్ద ప్రారంభమై 14,273-14,461 మధ్య కదలాడింది. చివరకు 64 పాయింట్లు నష్టపోయి 14,341 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.05 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా కేసుల విజృంభణ వంటి పరిణామాలు నేడు మార్కెట్లను ప్రభావితం చేశాయి. 

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బ్రిటానియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, విప్రో, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని