జీఎస్టీ పరిధిలోకి జెట్‌ ఫ్యూయల్‌‌? - Civil aviation min working on demand to bring jet fuel under GST: Kharola
close

Published : 12/03/2021 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీఎస్టీ పరిధిలోకి జెట్‌ ఫ్యూయల్‌‌?

ముంబయి: విమానాలకు వినియోగించే ఇంధనం ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు పౌరవిమానయాన శాఖ పనిచేస్తోందని ఆ శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా తెలిపారు. ఈ విషయమై ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. గ్లోబల్‌ ఏవియేషన్‌- ఎయిర్‌ కార్గో అంశంపై నిర్వహించిన వర్చువల్‌ సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు.

విమానాల నిర్వహణలో ఏటీఎఫ్‌ లేదా జెట్‌ ఫ్యూయల్‌ ఖర్చులే 45-55 శాతం ఉంటున్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఈ ఖర్చు అధికంగా ఉంటోంది. దీంతో ఏటీఎఫ్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈ అంశంపై పనిచేస్తున్నామని ఖరోలా తాజాగా వివరించారు. దీన్ని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లామని, జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. దేశీయ గగనతలాన్ని పూర్తిస్థాయి వినియోగానికి తీసుకురావడానికి తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వివిధ రంగాలతో పాటు విమానయాన రంగం కూడా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తట్టుకుని నిలబడిందని ఖరోలా అన్నారు. ఇందులో సరకు రవాణాదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి..
ఎన్‌పీఎస్‌ మంచి పథకమేనా?
షేర్లలో మదుపు...పన్ను నిబంధనలు తెలుసుకోండి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని