ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న ‘క్లీన్‌ సైన్స్‌‌’ - Clean Science and Technology files IPO papers
close

Published : 07/04/2021 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న ‘క్లీన్‌ సైన్స్‌‌’

దిల్లీ: ప్రత్యేక రసాయనాల తయారీ సంస్థ ‘క్లీన్‌ సైన్స్ అండ్‌ టెక్నాలజీ‌’ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి ప్రాథమిక వివరాలు సమర్పించింది. మొత్తం రూ.1,400 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి చెందిన ప్రమోటర్లు, వాటాదారులే వారి షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ఇష్యూలో కొత్త షేర్లేమీ విక్రయానికి ఉండవని సెబీకి సమర్పించిన వివరాల్లో క్లీన్‌ సైన్స్‌ పేర్కొంది.  

ఔషధాల తయారీ, ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఉపయోగించే ప్రత్యేక రసాయనాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా తొలి దశ పదార్థాలుగా, ఉత్ప్రేరకాలుగా వినియోగించే ప్రత్యేక రసాయనాలను ఇది తయారు చేస్తుంది. గత కొన్నేళ్లలో ఈ రంగంలో క్లీన్‌ సైన్స్‌ తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. కొవిడ్‌ కట్టడికోసం అందుబాటులోకి వచ్చిన అనేక నిత్యావసర వస్తువులను తయారు చేసే సంస్థల్లో ఈ రకం ప్రత్యేక రసాయనాలకు భారీ డిమాండ్‌ ఉంది. పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు భారత్‌తో పాటు చైనా, ఐరోపా, అమెరికా, తైవాన్‌, కొరియా, జపాన్‌ దేశాల్లోనూ కస్టమర్లు ఉన్నారు. సంస్థకు వస్తున్న ఆదాయంలో 67 శాతం ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని