Clean science: నేడే క్లీన్‌ సైన్స్‌ ఐపీఓ - Clean-Science-and-technology-IPO-to-open-today
close

Updated : 07/07/2021 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Clean science: నేడే క్లీన్‌ సైన్స్‌ ఐపీఓ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఔష‌ధాలు, ఎఫ్ఎంసీజీ ర‌సాయ‌నాలు వంటి క్రియాత్మ‌క, క్లిష్ట‌మైన ప్ర‌త్యేక ర‌సాయ‌నాల‌ను త‌యారు చేసే `క్లీన్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ` ఐపీఓ ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. 9న ముగిసే ఈ ఐపీఓ ఇష్యూ ధ‌ర ఒక్కో షేరుకు ₹ 880 - ₹900గా నిర్ణయించారు. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ (ఓఎఫ్ఎస్‌)గా ఉండటంతో ఈ ప‌బ్లిక్ ఇష్యూ నుంచి  క్లీన్ సైన్సెస్ ఎటువంటి నిధుల‌ను అందుకోలేదు. ఈ సంస్థకు కుర్కుంబ్‌, ఎమ్ఐడీసీ మ‌హారాష్ట్ర‌లో బ‌హుళ ఉత్పాద‌క స‌దుపాయాలు ఉన్నాయి. అధిక స్థాయి కచ్చిత‌త్వం, సామ‌ర్ధ్యంతో నిర్వ‌హించ‌డానికి అత్యాధునిక ఆటోమేటెడ్ యంత్రాలూ ఉన్నాయి.

ముఖ్య వివరాలు...

ఇష్యూ వ్య‌వ‌ధి: 7 జులై 2021 నుంచి 9 జులై 2021

ధ‌ర: ఈక్విటీ షేరుకు ₹880 నుంచి ₹900 వ‌ర‌కు

బిడ్ మొత్తం: 16 షేర్లు, దాని గుణిజాల‌లో

ముఖ విలువ: వాటాకు ₹1 ఈక్విటీ

లిస్టింగ్: జులై 19 నాటికి స్టాక్ ఎక్స్చేంజీల‌లో లిస్టింగ్‌ చేస్తారు

కొవిడ్ 19 సంక్షోభం ఉన్న‌ప్ప‌టికీ, క్లీన్‌ సైన్సెస్‌ 2021 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 22% టాప్‌లైన్ వృద్ధి సాధించింది. ఆదాయం 2019-21 కంటే 9.1% సీఎజీఆర్ పెరిగింది. ఇదే కాలంలో ఈ సంస్థ `ఈబీఐటీడీఏ`, `పీఏటీ సీఎజీఆర్‌`ను వ‌రుస‌గా 23.6%, 26.3%గా న‌మోదు చేసింద‌ని ఏంజెల్ బ్రోకింగ్ తెలిపింది. గ్రే మార్కెట్లో (లిస్ట్‌ చేయ‌ని) కంపెనీ షేర్లు 50% ప్రీమియంతో భారీగా వ్యాపారం చేస్తున్నాయి. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి త‌ర్వాత భార‌త ప్ర‌త్యేక ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ అతిపెద్ద మార్జిన్ ల‌బ్ధిదారుల్లో ఒక‌టిగా ఉంటుంద‌ని నిపుణుల‌ అభిప్రాయపడుతున్నారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని