FD Interest Rates: ప్ర‌ముఖ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు ఇలా.. - Compare-your-bank-FD-rates
close

Updated : 17/09/2021 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

FD Interest Rates: ప్ర‌ముఖ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు ఇలా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కేవ‌లం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్ర‌మే కాకుండా, గ్యారంటీ ఆదాయం కోసం ఎదురుచూస్తున్న పెట్టుబ‌డిదారుల‌కు ఉప‌యోగంగా ఉంటాయి. ఇప్ప‌టికీ గ్రామాల్లో, చిన్న ప‌ట్ట‌ణాల్లో బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీల‌పై ఆధార‌ప‌డేవారు చాలా మంది ఉంటారు. అయితే గ్యారెంటీ వ‌డ్డీ వ‌స్తుంది అనే మాటేగానీ వ‌డ్డీ రేట్లు మాత్రం బాగా ప‌డిపోయాయి అనేది వాస్త‌వం. స్వ‌ల్వ‌కాలానికే గానీ.. దీర్ఘ‌కాలానికి ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు అంత గిట్టుబాటు కావు. ఉదాహ‌ర‌ణ‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా 15 సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న మీ పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం ఆదా చేయ‌డం వ‌ల్ల ఎఫ్‌డీ ప‌న్ను అనంత‌ర వ‌డ్డీ మీరు అనుకున్నంత‌ రాబ‌డిని ఇవ్వ‌క‌పోవ‌చ్చు. ద్ర‌వ్యోల్బ‌ణానికి స‌మాన‌మైన రాబ‌డికి మీరు ప్లాన్ చేస్తే స్వ‌ల్ప కాల వ్య‌వ‌ధికి ఫిక్స్‌డ్ డిపాజిట్ వేస్తే స‌రిపోతుంద‌ని నిపుణుల అంచ‌నా. ఎఫ్‌డీల‌ను వేయ‌డానికి ముందు వివిధ కాల వ్య‌వ‌ధుల‌కు వ‌డ్డీ రేట్లు వివిధ బ్యాంకుల‌లో ఎంతున్నాయో తెలుసుకోవాలి.

వివిధ కాల వ్య‌వ‌ధుల‌కు రూ. 1 కోటి వ‌ర‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు అత్య‌ధిక వ‌డ్డీ రేట్ల‌ను అందించే బ్యాంకుల జాబితా

*ఈ డేటా 14 సెప్టెంబ‌ర్ 2021 నాటిది. విలీన‌మైన బ్యాంకుల ప్ర‌ధాన సంస్థ మాత్ర‌మే తీసుకోబ‌డింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని