Corona: భారత ఉద్యోగుల్లో ఆందోళన.. ఆశాభావం! - Concerns rise in Employees over financial and Job security due to corona
close

Updated : 30/04/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: భారత ఉద్యోగుల్లో ఆందోళన.. ఆశాభావం!

దిల్లీ: కరోనా కారణంగా ఉద్యోగుల్లో ఆర్థిక, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరిగాయని.. అయితే భవిష్యత్‌పై భారతీయులు సానుకూలంగానే ఉన్నారని ఓ సర్వేలో తేలింది. నవంబరు 17 నుంచి డిసెంబరు 11, 2020 మధ్య జరిపిన సర్వేలో 17 దేశాలకు చెందిన మొత్తం 32,471 సిబ్బంది పాల్గొన్నారు. ఏడీపీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన ఈ ‘పీపుల్‌ అట్‌ వర్క్‌ 2021: ఎ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ వ్యూ’ సర్వే ప్రకారం..

కరోనా సమయంలో తమ ఆర్థిక, ఉద్యోగ భద్రతపై ఆందోళనగా ఉన్నామని 95 శాతం భారతీయ సిబ్బంది పేర్కొన్నారు. అంతే శాతం మంది వచ్చే అయిదేళ్లలో భవిష్యత్‌ బాగుంటుందన్న ఆశలతో ఉన్నారు.
కరోనా వల్ల వృత్తిపరంగా ఎంతో కొంత ప్రభావం పడుతోందని 86% మంది తెలిపారు. ఉద్యోగం పోవచ్చని, లేదంటే తాత్కాలికంగా లే ఆఫ్‌లకు గురికావొచ్చని సగం మంది అంచనా వేశారు. వేతనాల్లో కోత ఉండొచ్చని 30% మంది, తమ పనిగంటలు లేదా బాధ్యతలు తగ్గొచ్చని 25% మంది పేర్కొన్నారు.
సిబ్బంది మనసులో నుంచి ప్రతికూలతలను తొలగించి సానుకూలతలను తీసుకురావడానికి మానవ వనరుల(హెచ్‌ఆర్‌) బృందాలు మార్గాలు అన్వేషిస్తున్నాయి.  
ఒక వేళ ఉద్యోగం కోల్పోయినా తమకు సంతృప్తి కలిగే మరో ఉద్యోగం(68%), మెరుగైన వేతనం(65%) లభిస్తుందని మూడింట రెండొంతుల మంది ఆశాభావంతో ఉన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని