వెయిటింగ్ పీరియ‌డ్‌ చూడ‌టం కూడా ముఖ్య‌మే.. - Consider-waiting-period-while-taking-health-insurance
close

Updated : 03/04/2021 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెయిటింగ్ పీరియ‌డ్‌ చూడ‌టం కూడా ముఖ్య‌మే..

ఆరోగ్య బీమాను దుర్వినియోగం చేయ‌కుండా, మోసాల‌ను నివారించేందుకు బీమా సంస్థ‌లు వెయిటింగ్ పీరియ‌డ్‌ విధిస్తాయి. ముందుగా ఉన్న అనారోగ్యాలు(పీఈడీ), నిర్థిష్ట వ్యాధుల‌కు వెయిటింగ్ పీరియ‌డ్‌ పూర్తైన‌ త‌రువాత బీమా క‌వ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది.

సాధార‌ణంగా , కూలింగ్ పీరియ‌డ్‌ త‌రువాత వెయింటింగ్ పీరియ‌డ్‌ ప్రారంభ‌మ‌వుతుంది. కూలింగ్ పిరియ‌డ్‌కు నెల రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌మాదాలు సంబంధిత కార‌ణాలు త‌ప్ప మిగిలిన వాటికి కూలింగ్‌\ ఇనిషియ‌న్ వెయిటింగ్ పీరియ‌డ్‌‌లో పాల‌సీ వ‌ర్తించ‌దు.

వెయింటింగ్ పిరియ‌డ్‌లో ఉన్న‌ప్పుడు ముందుగా ఉన్న అనారోగ్యాలు, నిర్ధిష్ట వ్యాధుల‌కు సంబంధించిన క్లెయిమ్‌ల‌ను బీమా సంస్థ‌లు అంగీకరించ‌వు. వినియోగ‌దారుడు పాల‌సీ ద‌ర‌ఖాస్తు చేసుకున్న నాటికి 48 నెల‌ల ముందు వ‌ర‌కు నిర్ధార‌ణ అయిన వ్యాధుల‌కు వెయింటింగ్ పీరియ‌డ్‌ వ‌ర్తిస్తుంది. మీరు ఎంచుకున్న బీమా సంస్థ‌, పాల‌సీ ఆధారంగా 4 సంత్స‌రాల వ‌ర‌కు వెయిటింగ్ పీరియ‌డ్‌ ఉండొచ్చు.

క‌వ‌రేజ్ అధికంగా(రూ.20 ల‌క్ష‌ల‌కు మించి) ఉండే చాలా ప్రీమియం పాల‌సీల‌లో ముందుగా నిర్ధారించిన వ్యాధుల‌కు వెయింటింగ్ పీరియ‌డ్‌ ఉండ‌క పోవ‌చ్చు లేదా త‌క్కువ‌గా ఉండ‌చ్చు. అదేవిధంగా కొన్ని బీమా సంస్థ‌లు, అధిక ప్రీమియం చెల్లించేందుకు సుముఖ‌త చూపిన వినియోగ‌దారుల‌కు కూడా త‌క్కువ వెయింటింగ్ పీరియ‌డ్‌‌ను అనుమ‌తిస్తున్నాయి.

కొన్ని వ్యాధుల‌ను వైద్య ప‌రీక్ష‌ల‌లో గుర్తించ‌డం క‌ష్టం, చికిత్స చేసేందుకు కూడా కొన్ని సంవ‌త్సారా‌లు వేచి చూడాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఆర్థ‌రైటీస్‌, ఇలాంటి నిర్దిష్ట వ్యాధులకు రెండేళ్ల వెయింటింగ్ పీరియ‌డ్‌ ఉంటుంది.

ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకునే ముందు వెయిటింగ్ పీరియ‌డ్‌ నిబంధన గురించి తెలుసుకోవాలి. వెయిటింగ్ పీరియ‌డ్‌ పాల‌సీ పాల‌సీకి, సంస్థ‌ సంస్థ‌కు మారుతుంటుంది. కాబ‌ట్టి త‌క్కువ వెయిటింగ్ పీరియ‌డ్‌ ఉన్న పాల‌సీల‌ను తీసుకోవ‌డం మంచిది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని