నిలిచిపోయిన 6 లక్షల ఇళ్ల నిర్మాణం - Construction of stalled 6 lakh houses
close

Published : 03/08/2021 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిలిచిపోయిన 6 లక్షల ఇళ్ల నిర్మాణం

ముంబయి: దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆలస్యం కావడం లేదా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు కనిపస్తున్నాయని స్థిరాస్తి సేవల సంస్థ ఆన్‌రాక్‌ ప్రోపర్టీ కన్సల్టెన్సీ ఒక నివేదికలో తెలిపింది. 2014కు ముందు ప్రారంభమైన దాదాపు 6లక్షలకు పైగా నివాస గృహాలు ఇంకా అందుబాటులోకి రాలేదని పేర్కొంది. వీటి విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. ఇందులో 1.74 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని.. వీటి విలువ రూ.1.74 లక్షల కోట్ల వరకూ ఉంటుందని పేర్కొంది. ఇందులో అధిక భాగం రూ.80 లక్షలలోపు విలువ ఉన్నవే. ఈ 6 లక్షల ఇళ్లలో దేశ రాజధాని దిల్లీలోనే 52 శాతం వరకూ నిర్మాణాలకు ఆటంకం ఏర్పడింది. వీటి విలువ రూ.2.49 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇక హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులలో కలిపి 11 శాతం వరకూ ఉన్నాయని సర్వేలో తేలింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇళ్ల నిర్మాణంలో పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదని ఆనరాక్‌ రీసెర్చ్‌ హెడ్‌ ప్రశాంత్‌ థాకూర్‌ తెలిపారు. కొవిడ్‌-19, వివాదాలతో పాటు ఇతర కారణాలూ ఇళ్ల నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నాయన్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని