దేశ పన్ను ఆదాయ సామర్థ్యం జీడీపీలో 4% మించట్లేదు - Country tax revenue capacity Does not exceed 4 percent of GDP
close

Updated : 24/04/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశ పన్ను ఆదాయ సామర్థ్యం జీడీపీలో 4% మించట్లేదు

15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌

దిల్లీ: మన దేశ పన్ను ఆదాయ సామర్థ్యం జీడీపీలో 4% కంటే తక్కువగా ఉందని, రెవెన్యూ నిర్వహణ వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రూపకల్పన చేసేందుకు రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని పేర్కొన్నారు. సీఎస్‌ఈపీ-ఐఎంఎఫ్‌ నిర్వహించిన ‘సెక్యూరింగ్‌ సస్టెయినబుల్‌ ఫైనాన్సెస్‌ అండ్‌ మీడియం-టర్మ్‌ ఫిస్కల్‌ ఫ్రేమ్‌వర్క్స్‌’ కార్యక్రమంలో సింగ్‌ ప్రసంగించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు పెరగడానికి అవసరమైన భారీ సంస్కరణలు రెవెన్యూ వ్యవస్థలో తీసుకురావాలని వెల్లడించారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రాకేశ్‌ మోహన్‌ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని