close
Array ( ) 1

తాజా వార్తలు

కొలంబియా యూనివర్సిటీ పరిశోధనలకు నాట్కో ఫార్మా ‘క్లోరోక్విన్‌’ ఔషధం

ఈనాడు, హైదరాబాద్‌:  ‘క్లోరోక్విన్‌’ ఔషధం తీసుకోవడం ద్వారా కొవిడ్‌- 19 రాకుండా నివారించవచ్చా... అనే కోణంలో పరిశోధనలు చేపట్టిన అమెరికా కొలంబియా యూనివర్సిటీకి అండగా నిలవాలని హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా నిర్ణయించింది. అమెరికాలోని తన మార్కెటింగ్‌ భాగస్వామి అయిన రైజింగ్‌ ఫార్మాసూటికల్స్‌ ద్వారా క్లోరోక్విన్‌ ఫాస్పేట్‌ ఔషధాన్ని  కొలంబియా యూనివర్సిటీకి ఉచితంగా అందిస్తోంది. క్లోరోక్విన్‌, మలేరియా వ్యాధికి మందు అనేది తెలిసిన విషయమే. దీనిపై కొలంబియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న కొవిడ్‌- 19 పరీక్షలు రెండో దశకు చేరుకున్నాయి. కొలంబియా యూనివర్సిటీలోని ఇర్వింగ్‌ మెడికల్‌ సెంటర్‌లో పనిచేసే దాదాపు 350 మంది వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది వంటి ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఇదే తరహా ఔషధ పరీక్షలు చేపట్టిన ‘క్రౌన్‌ కొలాబరేటివ్‌’ కు ఇదే ఔషధాన్ని నాట్కో ఫార్మా సరఫరా చేస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.