మార్చి 15న క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ ఐపీవో - Craftsman Automation IPO to open on Mar 15
close

Published : 09/03/2021 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చి 15న క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ ఐపీవో

దిల్లీ: వాహన పరికరాల తయారీ కంపెనీ క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ లిమిటెడ్‌ మార్చి 15న ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీవో)కు రానుంది. ఒక్కో ఈక్విటీ షేరు ధర శ్రేణిని 1,488-1,490గా నిర్ణయిస్తూ మంగళవారం కంపెనీ ప్రకటన విడుదల చేసింది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 17న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ మార్చి 12 నుంచి ప్రారంభం కానుంది.

కొత్తగా రూ.150 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. అలాగే ప్రమోటర్లు, వాటాదార్లకు చెందిన 45,21,450 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు, వాటాదార్లుగా ఉన్న శ్రీనివాసన్‌ రవి, కె.గోమఠేశ్వరన్‌, మరీనా-III ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఎఫ్‌సీ) తమ వాటాల్లో కొంత భాగాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ప్రస్తుతం కంపెనీలో మరీనాకు 14.06 శాతం, ఐఎఫ్‌సీకి 15.50 శాతం వాటాలున్నాయి. ఇక శ్రీనివాసన్‌ రవి 52.83 శాతం వాటాలతో మెజారిటీ వాటాదారుడిగా ఉన్నారు. అలాగే గోమఠేశ్వరన్‌కు 7.04 శాతం వాటాలున్నాయి.

తాజా ఐపీవోలో గరిష్ఠ ధర వద్ద రూ.824 కోట్లు సమకూరనున్నాయి. మొత్తం ఇష్యూలో సగం షేర్లు సంస్థాగత మదుపర్లకు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర బిడ్డర్లకు కేటాయించారు. ఇష్యూ ద్వారా సమకూరే ఆదాయాన్ని రుణాల చెల్లింపు సహా సంస్థ ఇతర నిర్వహణ ఖర్చులకు వినియోగించనున్నారు. యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

ఇవీ చదవండి...

టెల్కోల కొత్త నిబంధనలు..నిలిచిపోయిన ఓటీపీలు!

10వేల కంపెనీలు స్వచ్ఛంద మూసివేత!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని