ప్రారంభమైన క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ ఐపీఓ - Craftsman Automation Limited IPO Details
close

Published : 15/03/2021 14:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రారంభమైన క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ ఐపీఓ

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాహన పరికరాల తయారీ సంస్థ క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ లిమిటెడ్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నేటి(సోమవారం) నుంచి ప్రారంభమైంది. ట్రాక్టర్‌ సహా ఇతర భారీ వాహనాల్లో ఉపయోగించే సిలిండర్ల తరహా పరికరాలతో పాటు అనేక విడిభాగాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంటుంది. ఆటోమోటివ్‌-పవర్‌ట్రెయిన్‌, ఆటోమోటివ్‌-అల్యూమినియం ఉత్పత్తులు, ఇండస్ట్రియల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వంటి విభాగాల్లో ఈ కంపెనీ పనిచేస్తోంది. ఇండస్ట్రియల్‌ గేర్లు, మెరీన్‌ ఇంజిన్లు, క్రేన్‌ కిట్లు, గేర్‌ బాక్సులు, లోకోమోటివ్‌ ఎక్విప్‌మెంట్ల వంటివి ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు. కొత్తగా రూ.150 కోట్లు విలువ చేసే షేర్లను ఈ ఐపీఓలో విక్రయానికి ఉంచారు. అలాగే ప్రమోటర్లు, వాటాదార్లకు చెందిన 45,21,450 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. 
తాజా ఐపీఓలో గరిష్ఠ ధర వద్ద రూ.824 కోట్లు సమకూరనున్నాయి. మొత్తం ఇష్యూలో సగం షేర్లు సంస్థాగత మదుపర్లకు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర బిడ్డర్లకు కేటాయించారు. ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా శుక్రవారం రూ.247 కోట్లు సమకూరాయి. వారికి ఒక్కో షేరుకు రూ.1,490 వద్ద మొత్తం 16,58,447 షేర్లు కేటాయించారు.ఈ ఇష్యూ ద్వారా సమకూరే ఆదాయాన్ని రుణాల చెల్లింపు సహా సంస్థ ఇతర నిర్వహణ ఖర్చులకు వినియోగించనున్నారు. యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలు...

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: మార్చి 15, 2021
ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: మార్చి 17, 2021
బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: మార్చి 22, 2021
రీఫండ్‌ ప్రారంభ తేదీ: మార్చి 23, 2021
డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: మార్చి 24, 2021
మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: మార్చి 25, 2021

ముఖ విలువ: రూ.05 (ఒక్కో ఈక్విటీ షేరుకు)
లాట్‌ సైజు: 10 షేర్లు
కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 10 (ఒక లాట్‌)
గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 130 (13 లాట్లు)
ఐపీఓ ధర శ్రేణి: రూ.1488-1490 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

సంస్థ ఇతర వివరాలు...

కోయంబత్తూర్‌ కేంద్రంగా 1986లో క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ ఉనికిలోకి వచ్చింది. మొత్తం మూడు విభాగాల్లో పనిచేస్తున్న ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 12 తయారీ కేంద్రాలున్నాయి. డిసెంబరు 31, 2020తో ముగిసిన త్రైమాసికం నాటికి ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.50.66 కోట్ల లాభాల్ని ఆర్జించినట్లు సంస్థ పేర్కొంది. రూ.1,022.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. టాటా మోటార్స్‌, టాటా క్యుమిన్స్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, సీమెన్స్‌, ఎస్కార్ట్స్‌, అశోక్‌ లేల్యాండ్‌, వీఈ కమర్షియల్‌ వెహికల్స్‌, టీఏఎఫ్‌ఈ మోటార్స్‌ అండ్‌ ట్రాక్టర్స్‌ వంటి ప్రముఖ సంస్థలకు క్ట్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది.  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని