బ్యాంకు డిపాజిట్ల గురించి ఇక‌ ఆందోళ‌న అవ‌స‌రం లేదు - Customers-get-their-deposit-insurance-if-banks-falls-under-stress
close

Published : 02/02/2021 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకు డిపాజిట్ల గురించి ఇక‌ ఆందోళ‌న అవ‌స‌రం లేదు

ఒత్తిడికి గురైన బ్యాంకుల డిపాజిటర్లు తమ నిధులను పొందటానికి  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చ‌ర్య‌ల కోసం వేచి చూడాల్సిన అవ‌స‌రం లేకుండా ముందే తీసుకోవ‌చ్చు. బడ్జెట్ 2021, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ యాక్ట్, 1961, (డిఐసిజిసి యాక్ట్) ను సవరించాలని ప్ర‌తిపాదించింది. ఒక బ్యాంకు డిపాజిట‌ర్ల ఇవ్వాల్సిన‌ బాధ్యతలను నెరవేర్చలేకపోతే వారికి నిధులు పొందటానికి వీలు కల్పించేలా ఈ స‌వ‌ర‌ణ ఉంటుంద‌ది.

బ్యాంకును ఆర్‌బీఐ పరిశీలనలో ఉంచినప్ప‌టికీ  ఆ బ్యాంకు వినియోగదారులు రూ. 5 లక్షల డిపాజిట్ బీమా పరిమితి నిధులను పొందగలుగుతారు, కానీ బ్యాంకు సాధారణ కార్యకలాపాలు నిలిపివేస్తారు అని బ‌డ్జెట్ ప్ర‌సంగంలో  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్ల‌డించారు.

 ప్రభుత్వం గత సంవత్సరం డిపాజిట్ బీమా పరిధిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. ఏదేమైనా, ఈ దావా త‌ప్ప‌ని పరిస్థితులలో మాత్రమే వేసేందుకు వీలుంది. అంటే బ్యాంకు యొక్క లైసెన్స్ రద్దయిన‌ప్పుడు, దాని లిక్విడేషన్ చర్యలు ప్రారంభించినప్పుడు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

కఠినమైన నిబంధ‌న‌ల కారణంగా చాలా ఒత్తిడికి గురైన బ్యాంకులు ఈ కోవలోకి రావు. తీవ్ర‌ సంక్షోభం రాక‌ముందే ఆర్‌బీఐ ఆ బ్యాంకును తాత్కాలిక నిషేధంలో ఉంచుతుంది, ప్రజలు ఉపసంహరించుకునే మొత్తానికి ప‌రిమితి పెడుతుంది. కొన్ని విషయాలు త్వరలో పరిష్కారం అవుతాయి, మరికొన్ని సంవత్సరాలు  పట్టవచ్చు. అంటే డిపాజిటర్లకు కొన్ని సంవత్సరాలు వారి డ‌బ్బును తీసుకునే అవ‌కాశం ఉండకపోవచ్చు.

డిఐసిజిసి చట్టానికి సవరణలతో, డిపాజిటర్లు బ్యాంకు ఒత్తిడికి గురైనప్పటికీ రూ. 5 లక్షల వరకు నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. భద్రత కోసం తక్కువ రాబడి ఉన్నప్పటికీ వినియోగదారులు ఎక్కువగా బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, ఈ నిర్ణ‌యం వారిలో విశ్వాసాన్ని పెంచుతుంది అని ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని