బడ్జెట్‌ 2021: పెరగనున్న ఫోన్ల ధరలు? - Customs duty hike to make imported mobile phones chargers slightly expensive
close

Updated : 01/02/2021 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌ 2021: పెరగనున్న ఫోన్ల ధరలు?

దిల్లీ: నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ వివరాల ప్రకారం.. దిగుమతి చేసుకున్న మొబైల్‌ ఫోన్లు, ఛార్జర్ల ధర పెరగవచ్చని తెలుస్తోంది. ఆయా వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ ఐదు నుంచి పది శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ఫోన్లు, ఛార్జర్ల ధర 1 నుండి 2 శాతం వరకూ పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి, మదర్‌బోర్డ్‌లపై సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి, మొబైల్‌ తయారీలో వినియోగించే ఇతర పరికరాలపై కూడా సుంకాన్ని పెంచారు. మొబైల్‌ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీస్‌ వెల్ఫేర్‌ సెస్‌ మినహాయింపును కూడా ఈసారి రద్దు చేశారు.

ఇదిలా ఉండగా.. దేశీయంగా ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రపంచ ఉత్పత్తి గొలుసులో భారత్‌ను భాగస్వామిగా చేసేందుకు , ఉద్యోగావకాశాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ‘‘మేకిన్‌ ఇండియా విధానంలో భాగంగా మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, వాటి విడిభాగాలపై కస్టమ్స్‌ సుంకాల రేట్లులో పెరుగుదల ఉంటుంది. ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తి విలువ సామర్ధ్యం పెరుగుదల సాధ్యమౌతుంది. ’’ అని తన బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

ఐతే దిగుమతి సుంకంలో పెరుగుదల ప్రభావం వినియోగదారులపై అంతగా ఉండకపోవచ్చని.. దేశీయ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్ 97 శాతం అవసరాలు స్థానిక ఉత్పత్తుల వల్లనే సరిపోతాయని కొందరు పరిశీలకులు అంటున్నారు.

ఇవీ చదవండి..

అదే విశ్వాసమంటే.. నిర్మలమ్మ

మరింత పెరగనున్న చమురు ధరలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని