టీకాలపై మూడురోజుల్లో నిర్ణయం..! - DCGI will take decision in 3 working days
close

Published : 15/04/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాలపై మూడురోజుల్లో నిర్ణయం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కొవిడ్‌ కేసులు తీవ్రత పెరిగిపోవడంతో విదేశీ టీకాలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. దీంతో అమెరికా ఎఫ్‌డీఐ,ఐరోపా సంఘంలోని ఈఎంఏ, యూకేలోని ఎంహెచ్‌ఆర్‌ఏ, జపాన్‌ పీఎండీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో అనుమతులు పొందిన టీకాలు భారత్‌లో అడుగుపెట్టడం మరింత సులభంగా మారింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను నేడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది.  

‘నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌’ సిఫార్సు మేరకు టీకాల అత్యవసర అనుమతులను వేగవంతంగా పరిశీలించేందుకు అవసరమైన మార్గదర్శకాలను డీసీజీఐ నేతృత్వంలోని ‘ది సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌’ తయారు చేసి వెబ్‌సైట్‌లో ఉంచనుంది.  ఆయా విదేశీ టీకా సంస్థలు భారత అనుబంధ సంస్థలు లేదా స్థానికంగా గుర్తింపు పొందిన ఏజెంట్‌ ద్వారా సీడీఎస్‌సీవోకు దరఖాస్తు చేసుకోవాలి. పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి పనికి వస్తుందేమో సీడీఎస్‌సీవో పరిశీలించి 3 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడించాలి. దాని ఆధారంగా ఆ తర్వాత డీసీజీఐ అనుమతులు మంజూరు చేస్తుంది. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని