D-Mart Q2 results: డి-మార్ట్‌ లాభంలో మళ్లీ రెండింతలకు పైగా వృద్ధి - DMart Q2 profit rises twofold again
close

Updated : 16/10/2021 18:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

D-Mart Q2 results: డి-మార్ట్‌ లాభంలో మళ్లీ రెండింతలకు పైగా వృద్ధి

దిల్లీ: డి-మార్ట్‌ విక్రయ కేంద్రాలు నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ జులై‌- సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.417.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.198.53 కోట్లతో పోలిస్తే లాభం రెట్టింపునకు పైగా పెరగడం గమనార్హం. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.5,306.20 కోట్ల నుంచి 46.79 శాతం పెరిగి రూ.7,788.94 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ.7,248.74 కోట్లుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇవి రూ.5,046.69 కోట్లుగా ఉన్నాయి. స్టాండలోన్‌ పద్ధతిలో ఆదాయం రూ.5,218.15 కోట్ల నుంచి రూ.7,649.64 కోట్లకు పెరిగింది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఆదాయాల్లో 46.6 శాతం వృద్ధి ఉంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని