ఫ్లిప్‌కార్ట్‌లో ఏడీక్యూ రూ.3600 కోట్ల పెట్టుబడి! - DQ invests Rs 3600 crore in Flipkart
close

Updated : 15/06/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లిప్‌కార్ట్‌లో ఏడీక్యూ రూ.3600 కోట్ల పెట్టుబడి!

దిల్లీ: ఇకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3000-3660 కోట్ల (400-500 మిలియన్‌ డాలర్ల) పెట్టుబడి పెట్టేందుకు ఏడీక్యూ (అబుధాబి డెవలప్‌మెంటల్‌ హోల్డింగ్‌ కంపెనీ) సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌ విలువను 3500-4000 కోట్లుగా పరిగణించి ఈ పెట్టుబడి పెట్టనుంది. పెట్టుబడిదార్ల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నందున, 300 కోట్ల డాలర్ల వరకు సమీకరించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ చర్యలు తీసుకుంటోందని సమాచారం. సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు మరికొందరు పెట్టుబడిదార్లతో కూడా ఫ్లిప్‌కార్ట్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 1600 కోట్ల డాలర్లను వాల్‌మార్ట్‌ 2018లో కొనుగోలు చేసిన సంగతి విదితమే. 2020లో సంస్థ విలువను 2490 కోట్ల డాలర్లుగా పరిగణించి, మరో 120 కోట్ల డాలర్ల పెట్టుబడిని వాల్‌మార్ట్‌ పెట్టింది.

భారత్‌ బిల్‌ పేమెంట్‌ ద్వారా మొబైల్‌ రీఛార్జులు

ముంబయి: మొబైల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జులు కూడా చేసుకునే వీలును భారత్‌బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (బీబీపీఎస్‌) ద్వారా కల్పించేలా ఆగస్టు 31 నుంచి సర్వీసులు విస్తరిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఇప్పటివరకు డీటీహెచ్‌, విద్యుత్తు, గ్యాస్‌, టెలికాం, నీటి బిల్లులు మాత్రమే చెల్లించే వీలుంది. 2020 డిసెంబరు ఆఖరుకు దేశీయంగా 110 కోట్ల ప్రీపెయిడ్‌ కనెక్షన్లున్నాయి.

సంక్షిప్తంగా యాడ్‌

* ఏసీలు, ఎల్‌ఈడీల వంటి మన్నికైన వినియోగ వస్తువుల తయారీకి ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద లబ్ధి పొందేందుకు మంగళవారం నుంచి 3 నెలల పాటు దరఖాస్తు చేసుకోవచ్చని వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌ వెల్లడించారు.
* శ్యామ్‌ మెటాలిక్స్‌ అండ్‌ ఎనర్జీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు తొలి రోజు 1.23 రెట్ల స్పందన లభించింది.
* ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఏఎంసీ, దాని ట్రస్టీలు 6 డెట్‌ పథకాలను ఆపేసే (వైండింగ్‌ అప్‌) విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో సంస్థ సీనియర్‌ అధికారులపై సెబీ రూ.15 కోట్ల జరిమానా విధించింది. అయితే దీనిపై సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు (శాట్‌) వెళతామని కంపెనీ తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని