close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/06/2020 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ ఆస్థా-15’ ఔషధ సామర్థ్యంపై క్లినికల్‌ పరీక్షలు

దాల్మియా హెల్త్‌కేర్‌

దిల్లీ: కొవిడ్‌-19 చికిత్స కోసం తాము రూపొందించిన పాలీహెర్బల్‌ కాంబినేషన్‌ ‘ఆస్థా-15’ ఔషధ సామర్థ్యం, భద్రతను అంచనా వేయడానికి క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించినట్లు దాల్మియా హెల్త్‌కేర్‌ గురువారం వెల్లడించింది. మల్టీ-సెంట్రిక్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి అన్ని నియంత్రణ మార్గదర్శకాలు అనుసరిస్తామని దాల్మియా గ్రూపు తెలిపింది. ‘కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగులకు నయం చేయడానికి సహాయపడే మా అత్యంత సమర్థ ఆయుర్వేదిక్‌ సమ్మేళనం క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించామ’ని దాల్మియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ సంజయ్‌ దాల్మియా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ఔషధాన్ని ఇప్పటికే చెన్నైలోని ప్రత్యేక ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌-19 రోగులపై పరీక్షించి అధ్యయనం చేశారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కొవిడ్‌-19 చికిత్సకు ఈ ఔషధం తోడ్పడిందని అధ్యయనంలో తేలినట్లు సంస్థ పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.