హైదరాబాద్‌లోనే ఇళ్లకు అధిక గిరాకీ - Demand for Houses in hyderabad
close

Updated : 02/04/2021 08:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌లోనే ఇళ్లకు అధిక గిరాకీ

గత ఏడాది చివర్లో ధరలు పెరిగాయి
మిగతా నగరాల్లో ఈ పరిస్థితి లేదు
ఈనాడు - హైదరాబాద్‌

ళ్ల ధరలు హైదరాబాద్‌లో మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉందనుకుంటున్నారా? అదేమీ లేదు, హైదరాబాద్‌లోనే ధరలు పెరుగుతున్నాయి. మిగతా నగరాల్లో ఈ పరిస్థితి లేదు. గత ఏడాది చివరి త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగిన పరిస్థితి హైదరాబాద్‌ నగరంలోనే కనిపిస్తోందని రియల్‌ ఎస్టేట్‌ సేవల సంస్థ అయిన నైట్‌ఫ్రాంక్‌ విడుదల చేసిన ‘గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌- క్యూ4, 2020’ నివేదిక స్పష్టం చేసింది. అంతకు ముందు ఏడాది ఇదేకాలంతో పోల్చిచూస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 0.20 శాతం పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో బెంగుళూరు, ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ తదితర నగరాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. చెన్నైలో అధికంగా ఇళ్ల ధరలు 9 శాతం తగ్గినట్లు ఈ నివేదిక వివరించింది.


ఎందుకు గిరాకీ అంటే..

త ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్యకాలంలో..., జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలతో పోల్చినప్పుడు హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 127 శాతం పెరిగాయి. అక్టోబరు-డిసెంబరు మధ్యకాలంలో మొత్తం 3,651 యూనిట్ల(అపార్ట్‌మెంట్లు, సొంత ఇళ్లు) అమ్మకాలు నమోదు కాగా, అంతకు ముందు మూడు నెలల కాలంలో 1,609 ఇళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. కొవిడ్‌-19 మహమ్మారి ముంచుకొచ్చినప్పటికీ హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు స్ధిరంగా ఉన్నట్లు నైట్‌ఫ్రాంక్‌ సీఎండీ శిశిర్‌ బజాజ్‌ వివరించారు. గత ఏడాది మొత్తం మీద చూస్తే ధరలు ఏ నెలకా నెల  పెరుగుతూ వచ్చిన తీరు కనిపిస్తుందని అన్నారు. ఐటీ/ ఐటీఈఎస్‌ కంపెనీలు హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ఫలితంగా ఉద్యోగావకాశాలు పెరిగి,  హైదరాబాద్‌లో ఇళ్లకు గిరాకీ కొనసాగుతున్నట్లు విశ్లేషించారు.


అంకారాలో 30% పెరిగాయ్‌

నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక ప్రకారం చూస్తే... ప్రపంచ వ్యాప్త నగరాల్లో గత ఏడాది చివరి త్రైమాసికంలో అత్యధికంగా టర్కీ రాజధాని అంకారాలో ఇళ్ల ధరలు 30 శాతం పెరిగాయి. ఆ తర్వాత స్థానాల్లో టర్కీకే చెందిన ఇజ్మిర్‌, ఇస్తాంబుల్‌ నగరాలు ఉన్నాయి. ఒక మాదిరిగా ధరల పెరుగుదల న్యూజిలాండ్‌లో కనిపించింది. న్యూజిలాండ్‌లోని అక్‌ల్యాండ్‌, వెల్లింగ్టన్‌ నగరాల్లో 26.4%, 18.4% పెరిగాయి. కెనడాలోని హెలిఫ్యాక్స్‌ నగరంలో ఇళ్ల ధరల పెరుగుదల 16.3% ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని