మహిళా వ్యాపార సంస్థల డిజిటలీకరణ - Digitization of Women Business Enterprises
close

Updated : 15/07/2021 07:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళా వ్యాపార సంస్థల డిజిటలీకరణ

ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌తో స్నాప్‌డీల్‌ ఒప్పందం

దిల్లీ: మహిళల నేతృత్వంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాల (ఎస్‌ఎంబీలు)ను డిజిటలీకరించడానికి, వాటిని ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించినట్లు ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ వెల్లడించింది. ఇందుకోసం ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌తో (ఎఫ్‌ఎల్‌ఓ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఏడాది పాటు కొనసాగే ఈ ప్రోగ్రామ్‌ను ఫిక్కీ మహిళా సభ్యులకు, చేతి వృత్తుల వారికి, దేశంలోని 17 ప్రాంతీయ కేంద్రాల్లోని ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ కేంద్రాలతో కలిసి పని చేస్తున్న ఎన్‌జీఓలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వడం, కార్యశాలలు నిర్వహించి వారి ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు తోడ్పాటు అందించనున్నట్లు స్నాప్‌డీల్‌ తెలిపింది. విజ్ఞానాన్ని పంచడం సహా ఇ-కామర్స్‌ వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు వివరించి, వారి సొంత బ్రాండ్లు నిర్మించేందుకు సాయం చేయనున్నట్లు పేర్కొంది. ఉత్పత్తుల వివరణలు రాయడం, కేటలాగ్‌, జాబితా, ఆర్డర్‌ నిర్వహణతో సహా ఆన్‌లైన్‌ అమ్మకం ఉపయోగాలను వారికి వివరించనున్నట్లు స్నాప్‌డీల్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రజనీశ్‌ వాహి వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని